ఆ విషయంలో మీడియా పై సీరియస్ అయిన కేటీఆర్...!

తాజాగా కల్వకుంట్ల తారక రామారావు ( కేటీఆర్ ) మీడియా సంస్థలపై కాస్త ఫైర్ అయ్యారు.ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో ఆయన నవంబర్ 11 తర్వాత ఎన్నికలు జరుగుతాయని చెప్పినట్లుగా కొన్ని మీడియా సంస్థలు వార్తా కథనం చేశాయి.

 Ktr Is Serious About The Media In That Regard Ktr, Media, Elections, Trs Party,-TeluguStop.com

అయితే ఈ విషయం సంబంధించి తనపై వచ్చిన వార్తల విషయంలో కేటీఆర్ మీడియా సంస్థలపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు.తాను ఒకటి చెబితే మీడియా మరొకటి చేసిందంటూ.

ఆయన తెలియజేశారు.మీడియాలో చెప్పిన విషయం ప్రకారం తాను అలా మాట్లాడలేదని కేటీఆర్ స్పష్టంగా తెలియజేశారు.

తాను ఈ విషయానికి సంబంధించి… ఎన్నికలు నిర్వహించే ఎన్నికల సంస్థకి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టంగా తెలియజేశారు.తాను నవంబర్ రెండో వారం తర్వాతనే ఉండవచ్చని మాత్రమే చెప్పినట్లు తెలిపారు.

ఎన్నికలు ఏవైనా సరే పూర్తిగా అంత ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఉంటాయని ఆయన స్పష్టంగా వివరించారు.ఇక తాజాగా జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.

రాష్ట్రంలో అన్ని సర్వేలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, గ్రేటర్ హైదరాబాద్ లో 90 స్థానాలకు పైగా గెలిచే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు.అయితే ఈ విషయం సంబంధించి కార్పొరేటర్స్ ప్రజలతో కలిసి పోయి టిఆర్ఎస్ పార్టీ గెలుపుకు దోహదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అంతే కాకుండా ప్రజలకు ధరణి పోర్టల్ విషయంలో కూడా అవగాహన కల్పించాలని కేటీఆర్ తెలియజేశారు.ఇదివరకు మాదిరిగానే డిజిటల్ ఎన్నికల తరహాలో పార్టీ ప్రచారం బాగా ఊపందుకోవాలని అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

ఏదేమైనా మరోసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చరిత్ర తిరగరాసేందుకు టిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గ్రౌండ్ లెవెల్ నాయకుల నుంచి పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, ఎన్నికలలో అఖండ విజయం సాధించాలని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube