టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో స్టార్ హీరోలు అయిన రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.ఇక జనవరిలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల విడుదల తేదీ వాయిదా పడటంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.
ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని తెలుగు సినీ దర్శకులతో పాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు, పోస్టర్ లకు, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25న పాన్ ఇండియా లెవల్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన కానున్న విషయం తెలిసిందే.ఈ సినిమాని విడుదల చేయడానికి రాజమౌళితో పాటు చిత్రబృందం కూడా సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన సెన్సార్ పనులు కూడా పూర్తి అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సెన్సార్ నుండి U/A సర్టిఫికెట్ రాగా, ఈ చిత్ర రన్టైమ్ 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లుగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
![Telugu Corona, Komaram Bheem, Posters, Rajamouli, Ram Charan, Teaser-Movie Telugu Corona, Komaram Bheem, Posters, Rajamouli, Ram Charan, Teaser-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/03/ntr-ram-charan-rajamouli-Corona.jpg )
అయితే సినిమా ఎక్కువ సమయం ఉంది అని భావిస్తున్న చిత్రయూనిట్ ఈ సినిమాలోని చాలా సన్నివేశాలను కట్ చేసినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా చెప్పాలంటే అన్ని విషయాల లోను పర్ఫెక్షన్ కోరుకునే రాజమౌళి సినిమా నిడివి పెద్దగా ఉండకూడదు అని భావించి ఇందులో ఒక కీలక సన్నివేశాన్ని కట్ చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే భాగంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన సన్నివేశం ఒక నిమిషం 36 సెకండ్లు ఉండగా ఆ సన్నివేశాన్ని దర్శకుడు రాజమౌళి కట్ చేసినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఒక్క నిమిషం అయినప్పుడు ఆ సన్నీవేషం ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవచ్చు.మరి అలాంటిది జక్కన్న ఆ సన్నివేశాన్ని ఎందుకు తొలగించాడు అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.అయితే మూడు గంటలకు పైగా ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు రన్ టైమ్ తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తే అప్పుడు ఈ తొలగించిన సన్నివేశాన్ని యాడ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది.