తినడం తప్ప నాకు వంట చెయ్యడం రాదు.. యంగ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

సినీప్రేక్షకులకు నటి తేజు అశ్విని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

 Cant Cook Except Eating Says Heroine Teju Ashwini Details, Teju Aswini, Social-TeluguStop.com

అదే విధంగా అద్భుతంగా డాన్స్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది.ఈమె నటించిన తొలి చిత్రం కళ్యాణ సమయల్‌ సాదం సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.

ఈ సినిమా తరువాత తేజు అశ్విని పలు రకాల ఆల్బమ్స్ లో కూడా నటించింది.ఈ క్రమంలోనే తరుణ్‌ కుమార్‌ సంగీతంలో వచ్చిన హస్క్‌ మారో అనే ఆల్బమ్‌లో కవిన్‌తో కలిసి ఆడిపాడింది ఈ బ్యూటీ.

అంతేకాకుండా ఈమె ప్యారిస్‌ జయరాజ్‌,ఎన్న సొల్ల పోగిరాయ్‌ లాంటి సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.తేజు అశ్విని నటిగా కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.ఇక తాజాగా ఈమె ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు నవ్వుతూ ఫన్నీగా సమాధానమిచ్చింది.

ఆ విషయంపై స్పందించిన తేజు అశ్విని. తనకు తినడమేగాని వంట చేయడం రాదని, అందువల్లే తాను వంటల పోటీల్లో పాల్గొని ప్రసక్తేలేదని వెల్లడించింది తేజు అశ్విని.

తమిళ టీవీ కార్యక్రమాల్లో బాగా పాపులర్ అయిన కుక్‌ విత్‌ కోమాలి అనే వంటల పోటీలలో ఈమె పాల్గొన్న పోతున్నట్లు వార్తలు పెద్దఎత్తున వినిపించాయి.

Telugu Actressteju, Bollywood, Cook Komali, Show, Hari Haran, Shivangi, Solla Po

ఇప్పటికే ఈ షో రెండు సీజన్లలో విజయవంతంగా పూర్తి చేసుకోగా ఇక మూడవ సీజన్ ఇటీవలే మొదలైంది.ఇక ఇందులో శృతిక, తెలుగు లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్, సంతోష్ ప్రతాప్, శివాంగి, పుగల్, మణిమేఘలై వంటి అనేక మంది సెలబ్రెటీలు పాల్గొనబోతున్నారు.ఇక ఈ కార్యక్రమానికి తేజ అశ్విని వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపించగా ఆ వార్తలను తేజు అశ్విని కొట్టిపారేసింది.

Telugu Actressteju, Bollywood, Cook Komali, Show, Hari Haran, Shivangi, Solla Po

తేజు అశ్విని చివరగా నటించిన చిత్రం ఎన్న సొల్ల పోగిరాయ్‌. ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది.ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అశ్విన్ నటించిన విషయం తెలిసిందే.అయితే మొదట ఈ సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించు కోవాలి అనుకున్న తేజు అశ్వినీ ఏకంగా నటనకు మంచి మార్కులే కొట్టేసింది.

ఈ చిత్రానికి హరిహరన్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube