తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం.వేసవి కాలం వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చే పండు మామిడి(Mango).
మండుతున్న వేడిని తట్టుకునేందుకు చల్లటి మామిడి షేక్‌తో పాటు రుచికరమైన మామిడి పండ్లను ఆస్వాదిస్తుంటాం.అయితే మామిడి పండులా కనిపించే కోడి గుడ్డు(Egg)ను మీరు ఎప్పుడైనా చూశారా? మామిడి పండు లాంటి గుడ్డు అని ఆశ్చర్యపోకండి.ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో జరిగిన ఈ ఘటన ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఉగాది(Ugadi) తెలుగు సంవత్సరాది.వేసవి ప్రారంభంలో వచ్చే పండుగ.కొత్త సంవత్సరానికి సూచికగా ఉగాది జరుపుకుంటాం.
ఉగాది ఉంటే మనకు గుర్తొచ్చిది మామిడి.ఈసారి ఓ కోడిగుడ్డు కూడా ఈ పండుగలో పాల్గొంటోంది.
ఎందుకంటే అది మామిడిపండులా కనిపిస్తుంది.మనం తెలుపు లేదా గోధుమ రంగు గుడ్లు చూసే ఉంటాం.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఓ కిరాణా దుకాణం యజమాని మామిడికాయలా ఉన్న గుడ్డును చూసి ఆశ్చర్యపోయాడు.మామిడి కాయ ఆకారంలో ఉన్న గుడ్డు నిజానికి గుడ్డు అని దుకాణం యజమాని గ్రహించాడు.