కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ( Congress Leader Rahul Gandhi ) తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇప్పటికే పలు బహిరంగ సభలలో పాల్గొనడం జరిగింది.
అక్టోబర్ 19వ తారీకు పెద్దపల్లి సభలో ప్రసంగించారు.ఈ సభలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విమర్శలు చేయడం జరిగింది.
ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు.కాగా పెద్దపల్లి సభ ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టారు.
హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి పాదయాత్ర చేపట్టి.ప్రజలతో మమేకమవుతున్నారు.
ఇదే సమయంలో రాత్రికి కరీంనగర్ రాజీవ్ చౌక్( Karimnagar Rajiv Chowk ) చేరుకుని అక్కడ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు.
ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర( Bus yatra )లో ఉదయం కరీంనగర్ జిల్లాలో సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సమస్యల నుండి పరిష్కరిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం జరిగింది.మూడు రోజులపాటు తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమవుతూ పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు.
నవంబర్ నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ధీమాగా స్పష్టం చేస్తున్నారు.ప్రస్తుతం జరుగుతున్న పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి సమస్యలు వింటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసే పనుల గురించి రాహుల్ వివరిస్తున్నారు.