రాధిక, ఊర్వశిలతో రష్మిక సందడి.. వీడియో వైరల్!

గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకు పోతుంది.ప్రెసెంట్ ఈ అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే బేధం లేకుండా ఎక్కడ అవకాశం పలకరిస్తే అక్కడికి వెళ్తుంది.

 Radhika And Urvashi Fun Moments With Rashmika In Aadavallu Meeku Joharlu Sets De-TeluguStop.com

తెలుగులో రష్మిక ప్రెసెంట్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తుంది.ఇప్పటికే ఈమె లుక్ రివీల్ చేసారు.

రష్మిక మాస్ లుక్ తో ప్రేక్షకులను మాయ చెయ్యడానికి రెడీ అయిపోతుంది.

ఈ సినిమాతో పాటు రష్మిక శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమలశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో కూడా నటిస్తుంది.

ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఇది ఆడవాళ్ళ గురించే అని స్పష్టంగా అర్ధం అవుతుంది.ఇది ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా బాగా నచ్చే సినిమా అని దర్శకుడు చెబుతున్నాడు.

ఇప్పటికే విడుదల అయినా పోస్టర్ సినిమాపై మంచి హైప్ ఏర్పడేలా చేసాయి.

ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ రాధికా శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్బూ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ప్రెసెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ లో రష్మిక తో కలిసి రాధికా, ఊర్వశి సందడి చేసారు.రష్మిక మధ్యలో అటు ఇటు రాధికా ఊర్వశి నిలబడి తమిళ్ సూపర్ హిట్ సినిమా ‘నవరాత్రి’ సినిమాలో ‘నవరాతిరి.శుభరాతిరి’ అనే పాటకు ఒక వీడియో చేసారు.

ఈ పాట ఈ సీనియర్ హీరోయిన్స్ పడుతుంటే మధ్యలో రష్మిక సిగ్గు పడుతూ నిలబడి ఎక్సప్రెషన్స్ ఇస్తూ పాటలో లీనమయ్యింది.ఈ వీడియోను రాధికా సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఈ ముగ్గురు హీరోయిన్స్ కలిపి చేసిన వీడియో నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.మీరు కూడా ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను పంచుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube