ఇక 'పుష్ప 2' తగ్గేదేలే.. వెయ్యి కోట్లు ఖాయం!

అల్లు అర్జున్‌( Allu Arjun ) కు జాతీయ అవార్డు రావడం పట్ల ఇండస్ట్రీ మొత్తం కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది.అల్లు అర్జున్‌ కి మాత్రమే కాకుండా పుష్ప సినిమా కు పలు విభాగాల్లో కూడా అవార్డు రావడం పట్ల మైత్రి మూవీ మేకర్స్ వారు నక్క తోక తొక్కినట్లు అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్‌ లో చర్చ జరుగుతోంది.పుష్ప సినిమా దాదాపుగా రూ.400 కోట్ల వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే.ఇప్పుడు పుష్ప 2 సినిమా రూపొందుతోంది.

 Pushpa 2 Is In Huge Demand After Allu Arjun Won The National Award , Pushpa 2 ,-TeluguStop.com
Telugu Allu Arjun, National Award, Pan India, Pushpa, Sukumar, Telugu, Tollywood

జాతీయ అవార్డు ను సొంతం చేసుకున్న నటుడు అవ్వడంతో పాటు జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన సినిమా పుష్ప కు సీక్వెల్ గా పుష్ప 2( Pushpa 2 ) రూపొందుతున్న కారణంగా సాధారణంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 ఉంటుందని నమ్మకంగా ఉన్నారు.అందుకే ఈజీగా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.500 కోట్ల నుండి రూ.600 కోట్ల వరకు చేసే అవకాశాలు ఉన్నాయి.

Telugu Allu Arjun, National Award, Pan India, Pushpa, Sukumar, Telugu, Tollywood

అంతే కాకుండా అల్లు అర్జున్‌ స్థాయి అమాంతం పెరిగింది కనుక పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప 2 సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా నమ్మకంగా ఉన్నారు.అల్లు అర్జున్ మరియు సుకుమార్‌( Sukumar ) కాంబో కోసం తెలుగు ప్రేక్షకులు ఎలా అయితే ఎదురు చూస్తున్నారో ఇతర భాషల ప్రేక్షకులు కూడా అలాగే ఎదురు చూస్తున్నారు.కనుక పుష్ప 2 కి బ్రహ్మరథం పట్టడం ఖాయం.అలా పట్టడం వల్ల వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్ల తో పుష్ప 2 సినిమా జాతీయ అవార్డులను మరోసారి దక్కించుకుంటుందేమో చూడాలి.అల్లు అర్జున్‌ పుష్ప కోసం దాదాపుగా మూడున్నర సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉన్నాడు.

ఇప్పటికే జాతీయ అవార్డు వచ్చింది.ఇక పుష్ప 2 కి వెయ్యి కోట్లు నమోదు అయితే ఆయన కష్టంకు ప్రతిఫలం దక్కినట్లే.

జాతీయ అవార్డు రావడంతో ఇక పుష్ప తగ్గేదేలే అంటూ దూసుకు పోతాడేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube