ఏ రాష్ట్రంలోనైనా అయితే అధికారపక్షం లేదా ప్రతిపక్ష హోదా లో ఉంటూ వస్తున్న భాజపా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటుంది.తెలంగాణలో మూడవ స్థానంలో ఉన్న భాజపా కాంగ్రెస్( BJP party ) అధిగమించి బారాసకు గట్టి పోటీ ఇవ్వాలని ప్రయత్నాలు చేసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం నోటా తో పోటీపడే పరిస్థితుల్లో ఉన్న ఈ పార్టీ స్వతంత్రంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించింది.
జనసేన మా మిత్రపక్షం అని పదేపదే మీడియా సమావేశాలలో ప్రకటిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం ఉమ్మడి కార్యాచరణ గాని కనీస ఉమ్మడిగా మీటింగులు కానీ ఈ రెండు పార్టీల మధ్యన జరగకపోవడంతో అసలు మిత్రపక్షం అంటే అర్థం ఏమిటంటే ప్రశ్నలు వస్తున్నాయి.

విశాఖ( Visakhapatnam ) వేదికగా జరిగిన పదాధికారుల సమావేశంలో కూడా సొంతంగా బలపడాల్సిన అవసరం గురించి నొక్కి వక్కాణించిన బాజాపా నేతలు కార్యకర్తలు కష్టపడి పనిచేసి పార్టీని నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఏ పార్టీ మద్దత్తు అవసరం లేకుండా బవిష్యత్తు లో సొంతంగా అధికారంలోకి వచ్చే విధంగా పార్టీని నిలబెట్టుకోవాలి అంటూ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు.అధికారపక్ష వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీపై ప్రజల్లో నమ్మకం వచ్చే విధంగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దుకోవాలంటూ భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.కనీసం అధ్యక్షురాలు హోదాలో పురందేశ్వరి( Daggubati Purandeswari ) అయినా జనసేన తో పొత్తుల విషయంపై ఏదైనా క్లారిటీ ఇస్తారేమో అనుకుంటే ఆవిడ కూడా పార్టీని గ్రామ కమిటీల నుంచి బలోపేతం చేయటంపై దృష్టి పెడతామని మాట్లాడారు తప్ప జనసేనతో సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటామని ఏమో మాట్లాడక పోవడం గమనార్హం .

దీనితో అసలు పోత్తులు ఉన్నట్టా? లేనట్టా? అన్న కన్ఫ్యూజన్లో ఇరు పార్టీల కార్యకర్తలు ఉన్నట్లుగా తెలుస్తుంది .జనసేనతో భావ సానిహిత్యం ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో టిడిపి తో కచ్చితంగా జట్టు కట్టాలన్న జనసేన వ్యూహానికి( Jana sena ) తగ్గట్టుగా భాజపా సిద్ధంగా లేకపోవడం వల్లే కనిపించని ఒక గ్యాప్ రెండు పార్టీల మధ్యన కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది
.






