తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచాడు అన్నట్లుగా తయారయ్యింది తెలంగాణా అదికార పార్టీ పరిస్థితి .అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి మిగతా పార్టీల కన్నా వేగంగా దూసుకెళ్లాలని ఆశించిన బారాసా కు ఇప్పటికే తీరుబాటు అభ్యర్థులు చుక్కలు చూపిస్తుంటే ఇప్పుడు కోర్టు కోర్టు తీర్పులు పులి మీద పుట్రలా మారాయి అని తెలుస్తుంది.
దాదాపు 30 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు ఎమ్మెల్యేలలో టెన్షన్ వాతావరణ సృష్టిస్తున్నాయి.ఇప్పటికే కొత్తపేట ఎంఎల్ఏ వనమా వెంకటేశ్వరరావు( Vanama Venkateswara Rao ) సుప్రీం కోర్టు స్టే తో వూపిరి పీల్చుకుంటుంటే ఇప్పుడు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్( Krishna Mohan Reddy ) పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది.

ఎన్నికల నామి నేషన్ లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణల పై ఈయనపై కేసు నమోదు అయింది .ఆగస్టు 30వ తారీకు లోపు ఎమ్మెల్యేలు పై ఉన్న కేసులపై తుది తీర్పు ఇవ్వాలన్న సుప్రీంకేట్ ఆదేశాలనుసారం తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది.ఆ నియోజక వర్గం లో ఓడిపోయిన డీకే అరుణ( D.K.Aruna ) ను ఎమ్మెల్యే గా ప్రకటించడం సంచలనం గా మారింది.దాంతో ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు 28 మంది ఎమ్మెల్యేలు రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు దిక్కుతోచని స్థితి లో పడినట్లుగా తెలుస్తుంది.
ఎన్నికల సమయంలో తప్పుడు దృవపత్రాలు సమర్పించడం , ఎన్నికలలో జరిగిన అవకతవకలు, ఓట్ల లెక్కింపులో జరిగిన అవకతవకలు వంటి విషయాలపై 28 పిటిషన్లు గత ఎన్నికల సందర్భంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి.వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తూన్న ఈ కేసులు ఎట్టకేలకు సుప్రీంకోర్టు తీర్పుతో తుది అంకానికి చేరుకున్నాయి .ఇందులో మెజారిటీ కేసులలో అదికార పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తుందని అంచనాలు ఉండడంతో ఒకవైపు ఎన్నికలకు సిద్ధమవ్వాల్సిన పరిస్థితుల్లో ఈ కోర్టు తీర్పు అభ్యర్థులకు శరాఘాతం గా మారనుంది .

నిజానికి ఎన్నికల కు ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో న్యాయం చాలా ఆలస్యం అయినప్పటికీ చట్టాన్ని లైట్ తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురావుతాయో ఈ తీర్పు ఒక ఉదాహరణగా నిలవనుండి .ఇప్పటికే అనర్హత వేటు పడుతుందన్న అంచనా తో ఒక అభ్యర్థికి సీటు నిరాకరించిన బారాస ఇప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు అనర్హత కు గురైతే ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.