ఇటీవలి కాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా బాగా పెరిగిపోయింది.అయితే ఆయా కార్యక్రమాలపై ప్రేక్షకులలో ఉన్న ఆసక్తిని మరింతగా పెంచేందుకు ఎంతో ఇంట్రెస్టింగ్గా కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో లను విడుదల చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే ఇలా విడుదలైన ప్రతి ప్రోమో లో కూడా ఏదో ఒకటి స్పెషల్ గా కనిపిస్తోంది.ఇక కొన్ని కొన్ని సార్లు ఈ ప్రోమో లలో కనిపించే సెంటిమెంట్ బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా కార్యక్రమం పై మరింత ఆసక్తిని పెంచేస్తుంది అని చెప్పాలి.
ఇకపోతే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.ప్రోమో లో భాగంగా పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి ఎమోషనల్ కామెంట్ చేయడం అందరిని కంట నీరు పెట్టించింది అని చెప్పాలి.
జబర్దస్త్ లో స్పాంటేనియస్ పంచులతో పంచ్ ప్రసాద్ కి ఎంత పాపులారిటీ సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే పంచ్ ప్రసాద్ కి రెండు కిడ్నీలు దాదాపు 80శాతం పాడైపోయాయి అన్న విషయం తెలిసిందే.
ఆపరేషన్ చేయిస్తే నార్మల్ మనిషి అవుతాడు అని దీని కోసం జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా ఒక్క తాటి పైకి వచ్చారని అప్పట్లో నాగబాబు చెప్పారు.

అయితే ఇప్పటివరకూ అటు పంచ్ ప్రసాద్ కి ఆపరేషన్ ఎందుకు కాలేదో అనేది మాత్రం ఎవరికీ తెలియదు అనే చెప్పాలి.ఇక ఇటీవల విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో భాగంగా ఒక వ్యక్తి తాను పంచ్ ప్రసాద్ అన్న కి పెద్ద ఫ్యాన్ అంటూ చెబుతాడు.ఈ క్రమంలోనే మీరు ఒంటరిగా ఉన్న సమయంలో మీ సమస్యను తలచుకుని ఎప్పుడైనా బాధ పడ్డారా అంటూ పంచ్ ప్రసాద్ ను కిడ్నీ సమస్య గురించి అడుగుతాడు అభిమాని.
దానికి ప్రసాద్ సమాధానమిస్తూ తాను తన సమస్య గురించి ఏ రోజు బాధపడలేదని.ఒంటరిగా ఉన్న సమయంలో కూడా ఎక్కువగా ఆలోచించలేదని కామెంట్ చేశాడు.నిజంగా మీకు అవసరమైతే కిడ్నీ ఇవ్వడానికి తాను సిద్ధమేనని అభిమాని చెప్పడంతో ఇక ఇలాంటివి విన్న తర్వాత ఎంతో ఫీలవుతున్నానని రాంప్రసాద్ చెప్పుకొచ్చాడు.దేవుని ఇంకొన్నాళ్ళు మిమ్మల్ని నవ్వించే లైఫ్ స్పాన్ ఇస్తే బాగుండు అని కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు.
దీంతో సుధీర్ పంచ్ ప్రసాద్ దగ్గరికి వెళ్లి హత్తుకున్నాడు.ప్రసాద్ అలా అనడంతో అక్కడున్న వారందరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి.