అంగరంగవైభవంగా నిర్మాత కూతురు పెళ్లి.. మాయావనాన్ని తలపిస్తున్న పెళ్లి మండపం?

సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ లు , అలాగే దర్శకనిర్మాతలు, వారి పిల్లల పెళ్లిళ్లు ఎంతో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే.కేవలం స్టార్ హీరోయిన్లు హీరోలు మాత్రమే కాకుండా దర్శక నిర్మాతలు వారి పిల్లల పెళ్లిళ్ల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

 Producer Sunil Narang Daughter Jhanvi Narang Wedding Photos Set Details, Aditya-TeluguStop.com

ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలోని వారి పెళ్లి వేడుకలను అభిమానులు కనులారా తిలకించారు.అయితే సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో గ్రాండ్గా జరిగిన పెళ్లిళ్లు చూసి ఉంటారు కానీ ఇలాంటి అల్ట్రా రిచ్ రాయల్ వెడ్డింగ్ మాత్రం ఇప్పటివరకూ చూసి ఉండరు.

ఆ రేంజ్ లో అంగరంగ వైభవంగా స్టార్ ప్రొడ్యూసర్ ఏషియన్ సునీల్ నారంగ్ కుమార్తె పెళ్లి జరుగుతుండడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, వెటరన్ పంపిణీదారుడు,ఎగ్జిబిటర్ ఏషియన్ సినిమాస్ అధినేత కీ.శే నారాయణ దాస్ నారంగ్ కుమారుడు ఏషియన్ సునీల్ నారంగ్ కుమార్తె జాన్వీ నారంగ్ వివాహ మహోత్సవ సమయం ఇది.జాన్వీ నారంగ్ ఆదిత్య జంట వివాహ వేడుక కన్నుల పండుగను తలపించనుంది అనడానికి ఈ దృశ్యాలు చాలు.హైదరాబాద్ హైటెక్స్ నోవాటెల్ లో రాయల్ వెడ్డింగ్ నుంచి తాజాగా పెళ్లి వేదిక సెట్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి.ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ టాప్ స్టార్లు అగ్ర నిర్మాతలు పంపిణీ దారులు ఎగ్జిబిటర్లు సహా భారీగా ఆర్టిస్టులు సాంకేతిక నిపుణులు కూడా అటెండ్ కానున్నారు.

Telugu Aditya Yan, Asian Cinemas, Grand, Jhanvi, Novotel, Sunil, Royal, Sanjayle

టాలీవుడ్ లో అత్యంత గ్రాండియర్ పెళ్లి ఇంకొకటి లేనే లేదు.అనిపించే విధంగా ఈ పెళ్లి కోసం సెట్స్ నిర్మాణం చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి.పద్మావత్ భాజీరావ్ మస్తానీ సినిమాల కోసం సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన సెట్స్ కంటే గ్రాండియర్ గా ఈ సెట్స్ కనిపిస్తున్నాయ్.భారీతనం నిండిన సెట్ల నిర్మాణం కోసమే ఏకంగా కోటి ఖర్చయ్యి ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు.

ఇటీవలి కాలంలో ఈ రేంజు లో వెడ్డింగ్ టాలీవుడ్ లో ఇది తప్ప వేరొకటి లేనే లేదు అనడంలో అతిశయోక్తి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube