యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్‌ను ముగించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
ఈ సినిమా పూర్తి కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ ఆ తరువాత ఆదిపురుష్ అనే సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించాడు.
కాగా ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ డైరెక్ట్ చేస్తుండగా రామాయణం ఆధారంగా ఈ సినిమా రాబోతుంది.ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా టీ-సిరీస్ సంస్థ ప్రొడ్యూస్ చేయనుంది.
కాగా ఈ సినిమా తరువాత మరో ప్రెస్టీజియస్ బ్యానర్ యశ్ రాజ్ ఫిలింస్ సంస్థలో తెరకెక్కబోయే ఓ సినిమాలో ప్రభాస్ నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గా్ల్లో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమా కోసం సదరు బ్యానర్ ప్రభాస్‌ను అప్రోచ్ కాగా, ప్రభాస్ ఏ విషయం అనేది ఇంకా చెప్పలేదట.
దీంతో యశ్ రాజ్ ఫిలింస్ లాంటి భారీ బ్యానర్‌లో ప్రభాస్ నటిస్తున్నాడనే వార్త ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం ఆ సినిమాను అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
ఇక ప్రభాస్ ఇలా వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను ఓకే చేస్తుండటంతో ఆయన ఈ సినిమాలన్నింటినీ ఎప్పుడు పూర్తి చేస్తాడా అని వారు ఆసక్తిగా చూస్తున్నారు.