ప్రభాస్ ఫ్యాన్ మాములు ట్యాలెంట్ కాదుగా.. సలార్ కాన్సెప్ట్ వర్క్ కు చిత్ర యూనిట్ ఫిదా!

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Prabhas Fans Mad Salaar Movie Poster , Prabhas, Tollywood, Salaar Movie, Salaar Movie Poster , Prabhas Fans , Adi Purush-TeluguStop.com

ఇక ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో సలార్ సినిమా కూడా ఒకటి.అయితే సలార్ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇకపోతే ఇప్పటికే సలార్ సినిమా ప్రభాస్ లుక్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.ఇకపోతే ఇప్పటికే సదరు సినిమా 35 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

 Prabhas Fans Mad Salaar Movie Poster , Prabhas, Tollywood, Salaar Movie, Salaar Movie Poster , Prabhas Fans , Adi Purush-ప్రభాస్ ఫ్యాన్ మాములు ట్యాలెంట్ కాదుగా.. సలార్ కాన్సెప్ట్ వర్క్ కు చిత్ర యూనిట్ ఫిదా-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా 2023 సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే సలార్ సినిమాకు సంబంధించి నెలలు గడుస్తున్నా కూడా ఎటువంటి అప్డేట్స్ రాకపోవడంతో ఆది పురుష్ సినిమాపై, అలాగే సలార్ సినిమాల అప్డేట్స్ పై అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.

కొంతమంది అభిమానులు అయితే హీరో ప్రభాస్ సినిమాలు ఎలా కనిపించబోతున్నాడు అన్నది ఊహించుకొని ఆర్ట్స్ గీస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ అభిమాని ఒకరు సలార్ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు అన్నది ఆర్ట్ వేసి చూపించాడు.

ఆ పోస్టర్ లో ప్రభాస్ మైన్ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక సెక్యూరిటీ గార్డ్ ను చేతితో పట్టుకొని ఈడ్చుకుంటూ వస్తున్నట్టుగా ఆర్ట్ వేశారు.

ఆ ఆర్ట్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఆ ఫోటోలు కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలను చూసిన సలార్ చిత్రయూనిట్ ఆ అద్భుతమైన ఆర్ట్స్ ను వారి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.అమేజింగ్ ఆర్ట్ వర్క్ అంటూ అభినందించారు.

తాలా అనే ఒక ఆర్టిస్ట్ ఇలా కొత్త సినిమాల కాన్సెప్ట్ ను ఆర్ట్స్ రూపంలో వేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు.ఇకపోతే సలార్ సినిమా నుంచి విడుదల అయ్యే అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube