రాధే శ్యామ్ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆ సినిమా నిరాశ మిగిల్చిందని చెప్పాలి.ఫ్యాన్స్ వరకు సినిమా సూపర్ అనేస్తున్నా సినిమా నార్త్ లో పెద్దగా ప్రభావం చూపించడం లేదు.
బాహుబలి రేంజ్ కలక్షన్స్ చూసిన ప్రభాస్ సినిమా ఇప్పుడు రాధే శ్యాం కి వస్తున్న వసూళ్లను చూసి షాక్ అవుతున్నారు.ప్రభాస్ కి మరో బాహుబలి సినిమా లాంటి సినిమా పడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
అయితే ఆ సినిమా మరేదో కాదు ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సలార్ అని నమ్ముతున్నారు ఫ్యాన్స్.ప్రభాస్ క్రేజ్ కి ప్రశాంత్ నీల్ లాంటి టాలెంటెడ్ డైరక్టర్ టేకింగ్ లో సలార్ ఖచ్చితంగా ప్రతి ప్రభాస్ అభిమాని ఆకలి తీర్చేస్తుందని చెబుతున్నారు.
సలార్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలతో తెరకెక్కుతుంది.ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేస్తాడని అంటున్నారు.
కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తో ప్రశాంత్ నీల్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.ఇక రాబోతున్న ప్రభాస్ సలార్ తో రికార్డులు బద్ధలు కొడతాడని టాక్.