నీల్ బర్త్ డే వేడుకల్లో డార్లింగ్, రాఖీ బాయ్.. ఫ్రేమ్ అదిరిందిగా..

ప్రశాంత్ నీల్.ఇప్పుడు ఈ పేరు తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.

 Prabhas And Yash In Prasanth Neel Birthday Details, Prabhas And Yash Parties Wi-TeluguStop.com

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో అందరికి తెలుసు.కెజిఎఫ్ చాప్టర్ 1 భారీ హిట్ అందుకోవడంతో చాప్టర్ 2 కూడా చేసాడు.

ఏప్రిల్ 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.రిలీజ్ అయినా అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగి పోయింది.

దీంతో కేజిఎఫ్ మ్యానియా దేశాన్ని ఊపేస్తోంది అనే చెప్పాలి.పార్ట్ 1 ను మించి సాలిడ్ ఎలిమెంట్స్ తో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది.

రెండేళ్ల నుండి ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగడంతో ఆ అంచనాలను రీచ్ అయ్యేలా కష్టపడ్డాడు నీల్.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏకంగా 1100 కోట్లు వసూళ్ల ను అందు కున్నట్టు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

ఇండియాస్ టాప్ 3 సినిమాగా నిలిచింది.దీనంతటికి కారణం నీల్ అనే చెప్పాలి.ప్రశాంత్ నీల్ ఈ సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ తో మరొక సెన్సేషనల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాడు.

సలార్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ను డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.

ఇక ఇది ఇలా ఉంటే.ఇప్పుడు ఒక ఫ్రేమ్ లో ప్రశాంత్ నీల్, యష్, ప్రభాస్ కనిపించడంతో ఆ పిక్స్ వైరల్ గా మారాయి.వీరు కలిసేందుకు ఒక కారణం ఉంది.ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మెగా ఫ్రేమ్ ఇప్పుడు బయటకి వచ్చింది.నీల్ బర్త్ డే వేడుకల్లో భాగంగా వీరిద్దరూ పాన్ ఇండియా యాక్టర్స్ నీల్ పుట్టిన రోజు నాడు కలిశారు.ఈ సందర్భంగా హోంబలే ప్రొడక్షన్స్ వారు వీరికి స్పెషల్ థాంక్స్ చెబుతూ పిక్స్ షేర్ చేసారు.

ఈ వేడుకకి ప్రభాస్ హైదరాబాద్ నుండి బెంగుళూరు వరకు రావడంతో మరింత ఆనందంగా పోస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube