ఆ హీరో చేసిన పనికి గుండె ముక్కలయింది.. పూజా హెగ్డే కామెంట్స్ వైరల్!

బుట్ట బొమ్మ పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వరుస చిత్రాలతో ఎంతో బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే నటించిన మూడు చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

 Pooja Hegde Comments About That Hero And It Go Viral Pooja Hegde, Tollywood,-TeluguStop.com

ఇలా వరుస చిత్రాలు ఫ్లాప్ కావడంతో పూజాహెగ్డే బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవం ఎదురయింది.ఇలా వరుస ఫ్లాప్ చిత్రాలు ఎదురైనప్పటికీ ఈ మీకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు అని చెప్పాలి.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంటర్వ్యూ సందర్భంగా తన చిన్నప్పటి విషయాల గురించి ఈమె వెల్లడించారు.

తాను చిన్నప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కి పెద్ద అభిమానిని అని ఈ సందర్భంగా పూజ తెలియజేశారు.ఈ క్రమంలోని తన 12 సంవత్సరాల వయసులో హృతిక్ రోషన్ కోయి మిల్ గయా అనే సినిమాలో నటించారు.

ఎలాగైనా హృతిక్ రోషన్ తో ఫోటో దిగాలని ఎంతో ఆతృతతో ప్రీమియర్ షో కి వెళ్లాను.ఇలా ఆయనతో ఫోటో దిగడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఆయన స్టేజి దిగి వెళ్లిపోయారు.

Telugu Bollywood, Koi Mil Gaya, Pooja Hegde, Premiere Show, Tollywood-Movie

ఈ విధంగా హీరో స్టేజీ దిగి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా నా గుండె ముక్కలైందని పూజా హెగ్డే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన చిన్నప్పటి జ్ఞాపకాలను తెలియజేశారు.అయితే తిరిగి 10 సంవత్సరాల తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి మొహంజదారోలో నటించే అవకాశం తనకు వచ్చిందని ఇంటర్వ్యూ సందర్భంగా పూజా హెగ్డే తన అభిమాన నటుడు హృతిక్ రోషన్ గురించి వెల్లడించారు.ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube