Praneeth Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం..!

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు( Former SIB DSP Praneeth Rao )ను విచారిస్తున్న పోలీసులు ఎస్ఐబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లాగర్ రూమ్ లో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించారు.

 Police Investigation In Phone Tapping Case Intensified-TeluguStop.com

లాగర్ రూమ్ సిబ్బందికి ప్రమోషన్ ఆశ చూపి ప్రణీత్ రావు ట్యాపింగ్ లో వారి సహాయం తీసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు.

ఈ క్రమంలోనే ఆపరేషన్ రహస్యాలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడని తేలింది.అదేవిధంగా ప్రణీత్ రావు డైరీలో వందల సంఖ్యలో ఫోన్ నంబర్లను పోలీసులు గుర్తించారు.ఈ నేపథ్యంలో ప్రణీత్ రావు( Praneeth Ra )ను దర్యాప్తు అధికారులు క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.

దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube