అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులపై దాడులు ఏ మాత్రం ఆగలేదు.వరుస దాడులతో అక్కడ ఉండే భారతీయులు భయబ్రాంతులకి లోనవుతున్నారు.
అమెరికా చట్ట సభలలో భారతీయులపై దాడులు చేసిన వారిపై ఎన్ని చర్యలు తీసుకున్నా సరే వారి దాడులు పరంపర కొనసాగుతూనే ఉంది.తాజాగా జరిగిన ఘటనతో మరో మారు భారతీయులు ఉలిక్కి పడ్డారు.
వివరాలలోకి వెళ్తే.
కాలిఫోర్నియాలో టైరోన్ మెక్అలిస్టర్ అనే 18 ఏళ్ల కుర్రాడు.తన స్నేహితుడితో కలిసి భారత్‌కు చెందిన 71 ఏళ్ల సాహిబ్ సింగ్ నాట్ అనే వ్యక్తిపై పైశాచికంగా దాడి చేశాడు…దాడి తరువాత అతడిపై ఉమ్మేసి అవమానించారు.మార్నింగ్ వాక్‌కు వెళ్లిన సాహిబ్ సింగ్‌పై ఈ దాడి జరిగింది.
దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమేరాల్లో చిక్కడంతో పోలీసులు తక్కువ సమయంలోనే దుండగులను అదుపులోకి తీసుకున్నారు…అయితే దాడి సమయంలో దాడి చేసిన వ్యక్తీ చేతిలో తుపాకి కూడా ఉండటంతో ఇది పక్క ప్రణాళికలో భాగంగా జరిగిందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.అయితే
దాడి చేసిన నిందితుడు మెక్అలిస్టర్ తండ్రి కాలిఫోర్నియా పోలీస్ చీఫ్‌గా పనిచేస్తుండటం ఇందులో కొసమెరుపు.అతడి తండ్రి పోలీసు అధికారి కావడంతో నిందితుడు మరింత పొగరుగా కనిపించాడు అతడిని కోర్టులో హాజరుపరచినప్పుడు కెమేరాకు మధ్య వేలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు.చేతులకు బేడీలు వేసిన సమయంలో కూడా రౌడీలా ప్రవర్తించాడు… అయితే వీరికి ఇప్పటి వరకూ బెయిల్ రాలేదు పూర్తీ స్థాయి విచారణ చేసిన తరువాత నిందితులకి శిక్షని ఖరారు చేస్తారని ఉన్నత అధికారులు తెలిపారు.
ఈ దాడిని అగ్ర రాజ్యంలో ఉన్న భారత ఎన్నారైల సంఘాలు ఖండించాయి.