వైరల్ వీడియో: యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ..

జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం( International Yoga Day ) ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.ఈ క్రమంలో భారతదేశ వ్యాప్తంగా కూడా యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

 Pm Modi Leads Yoga Session In Srinagar To Mark 10th International Yoga Day Detai-TeluguStop.com

యోగ రోజు సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో( Srinagar ) నిర్వహించిన యోగ డే కార్యక్రమంలో భాగంగా భారతదేశ ప్రధాని మోడీ( PM Modi ) పాల్గొన్నారు.శ్రీనగర్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన దాల్ సరస్సు వద్ద ప్రజలతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అలాగే దేశవ్యాప్తంగా పలువురు ప్రభుత్వ అధికారులు, అలాగే యోగా అవుత్సాహికులు ఇంకా బీజేపీ పార్టీ మంత్రులు కూడా యోగ దినోత్సవం కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.ప్రధాని మోడీతోపాటు శ్రీనగర్ లో కొందరు జపాన్ కు( Japan ) చెందిన పలువురు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇక ఆయా ప్రాంతాలలో బీజేపీ పార్టీ నాయకులు( BJP Leaders ) కేంద్రమంత్రులు కూడా యోగా డేలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

నేడు జరుపుకుంటున్న యోగా దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, నితిన్‌ గడ్కరి, జైశంకర్‌, కిషన్‌ రెడ్డి, అమిత్‌ షా, జేపీ నడ్డా, ప్రహ్లాద్‌ జోషి, పీయుష్‌ గోయల్‌లతో పాటు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌., బీజేపీ ఎంపీ, సీనియర్‌ నటి హేమా మాలినిలు పాలగోన్నారు.అలాగే ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్‌ తో పాటు జమ్మూకశ్మీర్‌ లోని ప్యాంగాంగ్‌ సరస్సు వద్ద సైనికులు యోగా దినోత్సవంలో పెద్దెత్తున పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube