వైరల్ వీడియో: ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం..

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల 2024 ల నేపథ్యంలో టీడీపీ కూటమి భారీ విజయంతో అధికారంలోకి వచ్చింది.ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు.

 Cm Chandrababu Naidu Deputy Cm Pawan Kalyan Take Oath As Mlas Video Viral Detail-TeluguStop.com

టీడీపీ కూటమి భారీ విజయాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంతో పాటు మరికొన్ని మంత్రి శాఖలతో మంత్రిగా తన కర్తవ్యాన్ని నిర్వహించబోతున్నారు.ఈ క్రమంలో నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి.

శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు( AP Assembly ) మొదలు కావడంతో పలువురు కొత్త సభ్యులతో పాటు ప్రొటెం స్పీకర్ గోరంట్ల చౌదరి( Protem Speaker Gorantla Chowdary ) ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా శాసనసభ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు.ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అసెంబ్లీకి ప్రణమిల్లి సభలోకి అడుగు పెట్టారు.చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.

ఇక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిల తర్వాత మంత్రులందరూ ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.ఇక మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య మిగతా వారిని ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube