మెగా మేనల్లుడు , సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్( Saidharam Tej ), సంయుక్త మీనన్( Sanyukta Menon ) జంటగా నటించిన చిత్రం విరూపాక్ష .ఈ చిత్రం ద్వారా సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఎస్విసిసి , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌స్లే సమకూర్చారు .విభిన్న కథతో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్ , ట్రైలర్ అన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి .దీనితో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి .మరి ఈ అంచనాలని సినిమా అందుకుందా.సాయిధరమ్ తేజ్ ఈ సినిమా ద్వారా హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
ముందుగా కధ విషయానికి వస్తే .80, 90వ దశకంలో ఒక ఊరిలో సంభవించే వరుస మరణాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు .ఈ మరణాలకు కారణం చేతబడా.లేక ఎవరైనా చేసుంటారా.అనే పాయింట్ ఆధారంగా కధ సాగుతుంది .వాస్తవానికి రూపంలేని కన్నును విరూపాక్ష అంటారు .రూపంలేని శక్తితో పోరాటం చేసే చిత్రం కాబట్టి దీనికి విరూపాక్ష అనే టైటిల్ ఖరారు చేశారు.సింపుల్ గా చెప్పాలంటే ఓ ఫారెస్ట్ ఏరియా రుద్రవనం అనే గ్రామంలో 15 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన మహిళ, ఆ తర్వాత వరుసగా హత్యలు.ఆ చావులకు కారణం తెలుసుకునేందుకు విరూపాక్ష చేసిన పోరాటమే ఈ చిత్ర కధ అని చెప్పవచ్చు…ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం కావడంతో అంచనాలు పెరిగాయి.
దీనికి తోడు బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కడం కూడా సినిమా కి పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడానికి కారణం గ నిలిచింది .ఇక సినిమాని ఓ ఆసక్తికర పాయింట్ తో మొదలు పెట్టారు .కధనం కాస్త నెమ్మదిగా మొదలైనా.అసలు కథలోకి ఎంట్రీ అయినా తర్వాత మాత్రం చిత్రం థ్రిల్ కి గురి చేస్తూ ఆకట్టుకుంటుంది.
అలాగే సినిమాలో ట్విస్ట్ లు కూడా ఆసక్తికరంగా సాగుతుంది , అలాగే టేకింగ్ కూడా కొత్తగా ఉంది .ముఖ్యంగా డైరెక్టర్ కార్తీక్ దండు( Director Karthik Dandu ) కి ఇది తొలి సినిమానే అయినా టేకింగ్ పరంగా పరిణితి చూపించారు .ప్రారంభం నుండి చివరి వరకు సినిమా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతు అలరిస్తుంది.తేజ్ తన గత చిత్రాలకి భిన్నంగా .ఓ ఆసక్తికర పాయింట్ ని ఎంచుకోవడం అభినందించగల విషయం .అలాగే దర్శకుడు కూడా కధనాన్ని కొత్తగా రాసుకొని .దాని తెరపై కూడా అంతే కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు.అలాగే థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కే సినిమాలు ఆడియన్స్ ని సులువుగానే ఆకట్టుకుంటాయి .అయితే ఆ థ్రిల్ ఆడియెన్స్ కి నచ్చేలా ఉండాలి .ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు .మూడ నమ్మకాలు, చేతబడులు, జనాల వికృత చర్యలు.వంటి ఎలిమెంట్స్ తో సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లింగ్ ఫీల్ కలిగేలా సినిమాని తెరకెక్కించారని చెప్పవచ్చు .యాక్సిడెంట్ తర్వాత సినిమాలకు దూరమైన తేజు ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే .విరూపాక్ష పాత్రలో సాయి ధరమ్ తేజ్ అల్లుకుపోయాడు .కొత్త తరహా పాత్రలో తనదైన నటనతో మెప్పించాడు .అలాగే సంయక్త మీనన్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది .సునీల్( Sunil ) తనకు దక్కిన పాత్రలో అల్లుకుపోయారు .అలాగే బ్రహ్మాజీ పాత్ర కూడా బాగుంది .అయన నటన ఆకట్టుకుంది .రాజీవ్ కనకాల , అజయ్ వంటి వారు తమ పాత్రలకి న్యాయం చేశారు .మిగతా నటీనటులు పాత్ర పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు .
ఇక సాంకేతిక విషయాలకు వస్తే అజ్ నీష్ లోకనాథ్ ( Az Neesh Loknath )ఈ చిత్రానికి ఆకట్టుకునే సంగీతం అందించాడు.ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది .సుకుమార్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు అదనపు బలమని చెప్పవచ్చు .నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది .శాందత్ సాయినుద్దీన్ ఫొటోగ్రఫీ బాగుంది .ఇలాంటి సినిమాలకు ఫొటోగ్రఫీ కీలకం .శాందత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు .నిర్మాణ విలువలు బాగున్నాయి మొత్తంగా చూస్తే.ఇక ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ ఒక మంచి హిట్ కొట్టాడని తెలుస్తుంది…నెక్స్ట్ ఎలాగో పవన్ కళ్యాణ్ తో కలిసి వినొదయ సీతం తో మన ముందుకు రాబోతున్నారు.