కాపుల పరువు పోయే విధంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రవర్తన ఉందని మంత్రి కొట్టు అన్నారు.కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబాన్ని ఎంత హింస పెట్టారో తెలియదా అని ప్రశ్నించారు.
పవన్ చేసే పనులు, తీసుకునే నిర్ణయాలతో పాటు మాట్లాడే మాటలు కాపుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని మంత్రి కొట్టు మండిపడ్డారు.రాష్ట్ర పరిధిలో లేని కాపు రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇవ్వలేనన్న సీఎం జగన్ కాపు సామాజిక వర్గానికి మేలు కలిగేలా చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
కేవలం రాజకీయ లబ్ది కోసమే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.ఎన్ని ఆరోపణలు చేసినా పవన్ ను ప్రజలు నమ్మరని మంత్రి కొట్టు వెల్లడించారు.