ఎన్నికల వేళ కులగణన ఎందుకు అంటూ సీఎం జగన్ కి పవన్ కళ్యాణ్ లేఖ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన( Caste Census ) జరుగుతున్న సంగతి తెలిసిందే.దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్పందించారు.

 Pawan Kalyan Letter To Cm Jagan Asking Why Caste Census During Elections Details-TeluguStop.com

సరిగ్గా ఎన్నికలకు వేళ కులగణన ఎందుకు అంటూ సీఎం జగన్ కి( CM Jagan ) లేఖ రాశారు.ఈ లేఖలో కొన్ని ప్రశ్నలు సంధించారు.కులగణనకి సంబంధించి పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలు.

1.ఈ కులగణన ఉద్దేశం మీకు ఎన్నికల ముందే ఎందుకు వచ్చింది?
2.ఈ ప్రక్రియ కారణాలు వివరిస్తూ మీరు ఎందుకు ఏ విధమైన ప్రభుత్వపరమైన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదు?
3.ఇది రాజ్యాంగం మా అందరికి ఆర్టికల్ 21 ప్రకారం చెప్పిన వ్యక్తిగత గోప్యత, భద్రతా, స్వేచ్ఛ హరించడం కాదా?
4.కులగణన మీ ఉద్దేశం ఐతే, మరి మీకు ఉపకులం, ఆదాయం, భూమి యాజమాన్యం వివరాలు, కోళ్లు, మేకలు, ఆవులు, గేదలు ఇవనీ ఎందుకు?

Telugu Ap Census, Ap, Census, Cm Jagan, Janasena, Pawan Kalyan, Pawankalyan, Ycp

5.బీహార్ ప్రభుత్వం చేసిన కులగణన సుప్రీమ్ కోర్టులో ( Supreme Court ) ఉన్న నేపధ్యంలో, గౌరవ సుప్రీం కోర్ట్ తన తీర్పుని ప్రకటించక ముందే మీరు మీ స్వీయ ప్రయోజనాలకు ఎందుకు ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు?
6.జనగణన ఒక సంక్షిప్తమైన ప్రక్రియ, ఇది ఎంతో మంది నిపుణలతో చెయ్యవలసిన ప్రక్రియ, మీ వాలంటీర్లకు ఆ అర్హత, సామర్థ్యాలు ఎలా వున్నాయ్ అని నిర్ధారించారు?
7.ఇటువంటి డేటా సేకరణ ప్రక్రియ గతంలో కేంబ్రిడ్జ్ అనలిటిక చేసినప్పుడు అది ఏ విధంగా సమాజంలో అశాంతిని, అల్లర్లకు ప్రేరేపించాయి అనే విషయం మీకు తెలియదా? వాటిని ఎన్నికల కోసం స్వీయ ప్రయోజనాలకు మీరు ఎలా వాడుకున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారా?
8.ఇవన్నీ మీ అధికార దాహానికి ప్రతీక కాదా? ఒక వేళ కాకపొతే, ఇలా సేకరించిన డేటా( Data ) ఏ విధమైన దుర్వినియోగం జరగకుండా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి?

Telugu Ap Census, Ap, Census, Cm Jagan, Janasena, Pawan Kalyan, Pawankalyan, Ycp

9.ప్రజల నుండి డేటా సమ్మతి అనేది మీరు ఎలా తీసుకుంటున్నారు? అందరూ మీ నియంతృత్వానికి తలవంచుతారు అనుకుంటున్నారా?
10 ప్రభుత్వ వనరులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వీయ ప్రయోజనాలకు వాడుకోవడం, దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తూట్లు పోడవటం కాదా?
11.వాలంటీర్లు ద్వారా వైసీపీ ప్రభుత్వం( YCP Govt ) సేకరిస్తున్న కుల గణన, ఇతర వివరాలను ఏ కంపెనీ భద్రపరుస్తారు అనే అంశంపై శ్వేత పత్రం విడుదల చెయ్యాలి.
12.జగన్ రెడ్డి గారి YSRCParty ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలపై రాజకీయంగానే న్యాయ పరమైన మార్గాలను కూడా విశ్లేషించే దిశగా ఆలోచిస్తాము.అని పవన్ కళ్యాణ్ లేఖ రాశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube