పవన్ ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిందేనా ?

జనసేన పార్టీ పెట్టడం ద్వారా రాజకీయాల్లో సంచలనం సృష్టించేందుకు ప్రయత్నించారు ఆ పార్టీ అధినేత పవన్.పార్టీ పెట్టిన తరువాత రాష్ట్రమంతా పర్యటించారు.

ఆ తర్వాత ఎన్నికల బరిలోకి దిగి అదృష్టం పరీక్షించుకున్నా ఆయనకు నిరాశే ఎదురయ్యింది.కేవలం ఆ పార్టీ తరపున ఒకే ఒక్క ఎమ్యెల్యే గెలవడం పవన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక గెలిచిన ఒకే ఒక్క ఎమ్యెల్యే కూడా ఆయన మాట లెక్కచేయకపోవడం పవన్ కు బాధ కలిగిస్తోంది.అంతే కాదు పార్టీని నడపడంలో పవన్ ఎన్నో వడిదుడుకులు ఎదుర్కుంటూ ఉండడంతో ఇప్పుడు బీజేపీతో పొత్తుకు వెళ్లారు.

ఆ పార్టీ తో పొత్తు పెట్టుకున్నాకా పార్టీ దశ మారుతుందని భావించినా పవన్ కు నిరాశే ఎదురవుతోంది.అంతే కాదు బీజేపీ తనను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న తీరు కూడా పవన్ కు నచ్చడం లేదు.

Advertisement

ఈ దశలో ఒక వైపు రాజకీయాల్లో ఉంటూనే సినిమాల వైపు కూడా పవన్ అడుగులు వేశాడు.పింక్ సినిమా రీమేక్ లో నటిస్తూ ఉండడంతో ఆయనపై ఇప్పుడు రాజకీయంగా విమర్శలు పెరిగిపోతున్నాయి.

పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉంటానని సినిమాలకు ఇక స్వస్తి చెబుతున్నాను అంటూ గతం లో చేర్పిన మాటలు పవన్ ఇప్పుడు మర్చిపోయి సినిమాల్లోకి వెళ్లడం ఆ పార్టీ నేతలకే నచ్చడంలేదు.ఈ తీరు నచ్చకే కొద్ది రోజుల క్రితం జేడీ లక్ష్మి నారాయణ కూడా పార్టీని విడిపోయారు.

ఇప్పుడు పవన్ రెండు పడవల మీద ప్రయాణం మొదలు పెట్టారు.గతంలో ఎన్టీఆర్ ఇదే విధంగా ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ సక్సెస్ అయ్యారు.

ఇప్పుడు పవన్ కూడా అదే ఫార్ములాను ఉపయోగిస్తున్నారు.అయితే ఈ ఫార్ములా ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది అందరికి సమాధానం దొరకని ప్రశ్నగా ఉంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

రాజకీయంగా సక్సెస్ అయ్యేందుకు పవన్ ఇప్పుడు గట్టిగానే కష్టపడాల్సిన సమయం ఒక వైపు అధికార పార్టీ వైసీపీ దూకుడుగా రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా అదే రేంజ్ లో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.ఈ దశలో జనసేనను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడం పవన్ కు పెద్ద సవాలే.

Advertisement

ఒక వైపు పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లడం, మరో వైపు సినిమాల్లో నటించడం, మరోవైపు తాము పొత్తు పెట్టుకున్న బీజేపీ ఆజ్ఞలను పాటించడం ఇలా చెప్పుకుంటూ వెళ్తే పవన్ ఎన్నో సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి.

తాజా వార్తలు