మెగా మరియు నందమూరి సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద దశాబ్దాల నుండి నువ్వా నేనా అనే రేంజ్ పోటీ వాతావరణం ఉంది.అభిమానులు కూడా బయట రెండు వర్గాలుగా విడిపోయి దశాబ్దాల నుండి రికార్డ్స్ కోసం పోటీ పడుతూనే ఉన్నారు.
అభిమానుల మధ్య మరియు సినిమాల మధ్య ఎంత పోటీ తత్త్వం ఉన్నా, హీరోలు మాత్రం అన్నదమ్ములు లాగ కలిసి మెలిసి ఉంటారు.నేటి తరం హీరోలు రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఎంత సన్నిహితంగా ఉంటున్నారో, అప్పట్లో చిరంజీవి- బాలకృష్ణ కూడా అంతే సున్నితంగా ఉండేవారు.
చిరంజీవి మరియు బాలకృష్ణ కలిసి నటించే అవకాశం వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు కానీ.రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ #RRR చిత్రం లో కలిసి నటించి, రికార్డ్స్ మొత్తం బద్దలు కొట్టి ఆస్కార్ అవార్డు ని కూడా గెలుచుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.
ఇదంతా పక్కన పెడితే అప్పట్లో పవన్ కళ్యాణ్ మరియు హరికృష్ణ( Hari Krishna ) కాంబినేషన్ లో కూడా ఒక సినిమాని తెరకెక్కించాలని అనుకున్నాడట ప్రముఖ డైరెక్టర్ వై వీ ఎస్ చౌదరి( YVS Chowdary ).‘సీత రామరాజు‘ సినిమా తరహాలో, హరి కృష్ణ ని అన్నయ్య గా, పవన్ కళ్యాణ్ ని తమ్ముడిగా ఒక అద్భుతమైన కథని రాసుకున్నాడట.ఇద్దరికీ ఆ సినిమా చెయ్యడం ఇష్టమే, హరికృష్ణ డేట్స్ కూడా ఇచ్చేశాడట.కానీ పవన్ కళ్యాణ్ నుండి డేట్స్ విషయం లో క్లాష్ రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ కార్య రూపం దాల్చలేదట.
అయితే ఎప్పటికైనా వై వీ ఎస్ చౌదరి ఈ కథని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో చేయించాలని పట్టుదలతో ఉన్నాడట.దురదృష్టం కొద్దీ ఇప్పుడు హరికృష్ణ గారు మన మధ్యలో లేరు.
కాబట్టి ఆయన స్థానం లో మెగాస్టార్ చిరంజీవి తో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట వై వీ ఎస్ చౌదరీ.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వై వీ ఎస్ చౌదరి ఈ విషయాన్నీ చెప్పుకొచ్చాడు.చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ని ఆయన ఒప్పించొచ్చు.కానీ వై వీ ఎస్ చౌదరి కి ప్రస్తుతం ఫ్లాపులే ఉన్నాయి.
ఆయన్ని నమ్మి కోట్ల రూపాయిలను ఖర్చు చేసే నిర్మాతలు లేరు.ఒకప్పుడు వై వీ ఎస్ చౌదరి నిర్మాతల కోసం ఎదురు చూడకుండా తన సొంత బ్యానర్ ‘బొమ్మరిల్లు ఆర్ట్స్‘ పై సినిమాలను నిర్మించేవాడు.
కానీ ఇప్పుడు అంత డబ్బు పెట్టి సినిమా తీసే స్థితిలో చౌదరి కూడా లేదు.రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్స్( Konidela Production )’ బ్యానర్ అనుకుంటే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకొని వెళ్లొచ్చు.
మరి అది జరుగుతుందో లేదో చూడాలి.