ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనను పవన్ నాయుడు అని వెటకారంగా పిలవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాను జగన్ రెడ్డి అంటే తప్పేముందని, జాతీయ మీడియా కూడా ఆయనను అలాగే పిలుస్తుందని పవన్ అన్నారు.అయినా జగన్ ఓ క్రిస్టియన్ అని, ఆయన ఆ మతాన్ని గౌరవిస్తున్నపుడు ఇంకా కులం తోక తగిలించుకోవడం ఏంటని ఘాటైన విమర్శ చేశారు.
అసలు జగన్మోహన్‌రెడ్డి తిరుపతి ప్రసాదం తింటారో తినరో కూడా తనకు తెలియదని పవన్ అన్నారు.

ఇక మంత్రి బొత్స సత్యనారాయణపై కూడా పవన్ బాగానే సెటైర్లు వేశారు.నన్ను తిడితే మీ మంత్రి పదవి మరో రెండు నెలలు పెరుగుతుంది తప్ప ఏమీ ప్రయోజనం ఉండదని అన్నారు.నా పెళ్లిళ్లు, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్న మీ ముఖ్యమంత్రికి ముందు మాట్లాడటం నేర్పించండి అంటూ బొత్సకు సూచించారు.
వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలని ఘాటుగా స్పందించారు.

తెలంగాణలో అందరం ఒకటే అన్న భావనతో జీవితస్తారని, ఏపీలోనే ఇలా కులాల వారీగా విడిపోయి బతుకుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల ముందు జగన్, పవన్ మధ్య మాటల యుద్ధమే నడిచిన సంగతి తెలిసిందే.పవన్ పెళ్లిళ్ల అంశాన్ని జగన్ ప్రస్తావించడంపై అప్పట్లో పెను దుమారమే రేగింది.
అవకాశం వచ్చినప్పుడల్లా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం పవన్ చేస్తున్నారు.
ఈ మధ్య జగన్ సర్కార్ ఇంగ్లిష్ మీడియంపైనా వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించారు పవన్ కల్యాణ్.
ప్రతిపక్షంలో ఉన్నపుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని జగన్ చేసిన ట్వీట్‌ను పవన్ తెరపైకి తీసుకొచ్చారు.యాస, సంస్కృతిని అవమానిస్తేనే తెలంగాణ విడిపోయిందని, మరి ఇప్పుడు ఏకంగా మాతృభాషనే చంపేసి, ఉనికి లేకుండా చేస్తానంటే ఏం జరుగుతుందో ఊహించగలరా అంటూ జగన్ ప్రభుత్వంపై పవర్ విరుచుకుపడ్డారు
.