స్టాలిన్ ఆ ఆశ నెరవేరదు

స్వర్గీయ కరుణానిధి పెద్ద కుమారుడు అళ‌గిరి తన తమ్ముడు స్టాలిన్ పై విమర్శలు చేశాడు.ఆయన మధురై లోని తన మద్దతుదారులతో భేటీ అయ్యాడు.

 Stalin Cannot Become A Tamilandu Cm, Alagiri , Dmk, Karunanidhi, Stalin, Tamilna-TeluguStop.com

గతంలో డి‌ఎం‌కే పార్టీ ఎన్నో ఓడిదుడుకులు ఎదుర్కున్నప్పుడు ఓ కార్య కర్తగా పార్టీ కోసం పని చేశాను అన్నాడు.దక్షిణ తమిళనాడు బాధ్యతలు డి‌ఎం‌కే పార్టీ కార్యదర్శిగా నాకు అప్ప జెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద పట్టు సాదించి విజయాలు అందించనాని గుర్తు చేశాడు.

ఓ సారి స్టాలిన్ కుటుంబంతో సహా వచ్చినప్పుడు కరుణానిధి తర్వాత పార్టీకి అన్నీ నీవే అని ప్రోత్సహించానని అన్నాడు.

కరుణానిధితో మాట్లాడి స్టాలిన్ కు కోశాధికారి పదవిని ఇప్పించాను.

ఆ తర్వాత డి‌ఎం‌కే అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సి‌ఎం పదవి ఇప్పించాను అన్నాడు.తనకు ఏనాడు కూడా పదవులపై ఆశలేదని అన్నాడు.

పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నన్ను ఏదో తప్పు చేసినట్లుగా పార్టీ నుండి బయటకు పంపించడం బాధకారంగా వుందని అన్నాడు.స్టాలిన్ తమిళనాడుకు సి‌ఎం కావాలని పగటి కలలు కంటున్నాడు.

అలాంటి ఆశలు నేరవరవని అళ‌గిరి అన్నాడు.త్వరలో ఈయన డి‌ఎం‌కే పార్టీకి దీటుగా కలైంజర్‌ డీఎంకే పేరిట పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube