బీజేపీ న్యూ స్ట్రాటజీ.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా ?

గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ( BJP )కి ఈసారి ఎన్నికలు అత్యంత కీలకం.ఈ సారి ఒడితే పార్టీలో చాలానే మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

 Bjp Political Strategy To Win In Elections,bjp,pm Narendra Modi,assembly Electio-TeluguStop.com

ప్రధాని అభ్యర్థి మార్పుతో పాటు కీలక పదవుల్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది.అందుకే ఈసారి ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కాషాయ పార్టీ గట్టి పట్టుదలగా ఉంది.

ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా మోడి మేనియా( PM Narendra Modi )తోనే అధికారంలోకి రావాలని చూస్తోంది కాషాయ పార్టీ.అయితే గతంతో పోల్చితే ప్రస్తుతం మోడికి ప్రజల్లో ఆధారణ చాలావరకు తగ్గిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది.

ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్ని మోడికె పట్టం కడుతున్నప్పటికి సీట్ల విషయంలో బీజేపీ ఆశిస్తున్నట్లుగా రావడం లేదట.పైగా ఈసారి కూడా 300 పైగా సీట్లు సాధించాలని బీజేపీ టార్గెట్ ఘ పెట్టుకుంది.

Telugu Amith Shah, Assembly, Congress, Congressrahul, Narendra Modi-Politics

కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే అన్నీ సీట్లు గెలవడం కష్టమే అనే వాదన వినిపిస్తోంది.ఎందుకంటే మణిపూర్ అల్లర్లు, నిత్యవసర ధరల పెరుగుదల, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు.ఇలా అంశాల్లో మోడి సర్కార్ పై వ్యతిరేకత పెరుగుతోంది.దానికి తోడు ప్రతిపక్ష పార్టీల తరుపున పి‌ఎం‌ అభ్యర్థిగా ఉన్న రాహుల్ గాంధీ( Congress Rahul Gandhi )కి అనూహ్యంగా ఆధారణ పెరుగుతోంది.

దీంతో ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని కొత్త వ్యూహాలకు పడుతూ పెడుతోందట బీజేపీ అధిష్టానం.ఈసారి ఎలాగైనా గెలవడంతో పాటు 300 సీట్లు కైవసం చేసుకోవాలంటే ముందస్తు ఎన్నికలకు వెల్లడమే మంచిదని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారట.

Telugu Amith Shah, Assembly, Congress, Congressrahul, Narendra Modi-Politics

అయితే పార్లమెంట్ ఎన్నికలు మరియు అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) ఒకసారి జరిపితే అందుకు రాష్ట్రప్రభుత్వాలు ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువ.అందుకే ఎవరు ఊహించని విధంగా కేవలం పార్లమెంట్ ఎన్నికలను ముందస్తుగా మర్చితే ఎలా ఉంటుందనే ఆలోచన మోడీ సర్కార్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.అందులో భాగంగానే ఈ ఏడాది చివర్లో మొదటి అభ్యర్థులను 130 స్థానాలకు ప్రకటించే అవకాశం ఉందని టాక్.అయితే ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.

వాటితో పాటుగా పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) కూడా ఒక నెల అటు ఇటూగా నిర్వహిస్తే బీజేపీకి కలిసొస్తుందనే ప్లాన్ లో కమలనాథులు ఉన్నట్లు నేషనల్ మీడియా కొడై కుస్తోంది.మరి కాషాయ పార్టీకి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube