టాలీవుడ్ టాప్ హీరో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్.2022 మార్చి 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించింది.ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లో హీరోలుగా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో చెర్రీ తారక్ ఇద్దరు పాన్ ఇండియా స్టార్ట్ గా మారారు.
ఈ సినిమా విడుదల అయ్యి ఏడాది పూర్తి కావస్తున్నా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు.సినిమాలోని పాటలు సన్నివేశాలు నటీననటుల నటన గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా ఎన్నో రకాల అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా ఈ సినిమా హాలీవుడ్ ఆస్కార్ రేసులో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడబోతోంది.నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన విషయం తెలిసిందే.మార్చి 12వ తేదీన విన్నర్స్ కు ఆస్కార్ అవార్డులను కూడా ప్రధానం చేయనున్నారు.
ఇక అందులో భాగంగానే ఎన్టీఆర్ త్వరలోనే అమెరికా ప్రయాణం చేయనున్నాడు.ఇది జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు తారకరత్న మరణంతో హెచ్ సి ఏ అవార్డ్స్ కు కూడా హాజరు కాలేకపోయిన విషయం తెలిసిందే.
కానీ ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమానికి మాత్రం హాజరు కానున్నారు.

అందులో భాగంగానే మార్చి 5వ తేదీన సాయంత్రం అమెరికా వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది.అదే రోజు ఉదయం తన ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.సినిమా లాంచింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత అదే రోజున అమెరికా ప్రయాణం చేయబోతున్నాడు తారక్.
తనకు రావాల్సిన అవార్డును కూడా అప్పుడే అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే హెచ్ సి ఏ అవార్డును చెర్రీ అందుకున్న విషయం తెలిసిందే.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒకేసారి వెళ్లి రెండు అవార్డులను అందుకోనున్నారు ఎన్టీఆర్.కాగా రామ్ చరణ్ హెచ్ సి ఏ అవార్డును అందుకోవడంతో తారక్ అభిమానులు ఎందుకు ఎన్టీఆర్ ని పిలవలేదు అంటూ సోషల్ మీడియాలో నానా హంగామా చేయడంతో మేమే పిలిచాము కానీ తారక్ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు అంటూ హెచ్సీఏ వారు స్పందించిన విషయం తెలిసిందే.