అభిమానులకు క్షమాపణలు చెప్పిన శ్రీ లీల.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ హీరోయిన్ శ్రీ లీల గురించి మనందరికీ తెలిసిందే.పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

 Heroine Sreeleela Apologized To Fans Details, Sre Leela, Visit Village, Tollywoo-TeluguStop.com

మొదటి సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.మరి ముఖ్యంగా ఈమె అందానికి డాన్స్ కి యూత్ లో విపరీతమైన అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు.

రెండవ సినిమాతోనే స్టార్ హీరో అయినా రవితేజ సరసం నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఇటీవలే విడుదల అయిన ధమాకా సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ ఖాతాలో మరో హిట్ సినిమా పడింది.దీంతో శ్రీ లీల వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.సినిమాలపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఈ నేపథ్యంలోని ఈ మధ్యకాలంలో క్రేజ్ పెరిగిపోతుండడంతో సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు కూడా సై అంటుంది ఈ బ్యూటీ.ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ లీల అభిమానులకు క్షమాపణలు చెప్పింది.

అసలు ఏం జరిగిందంటే.తాజాగా శ్రీ లీల సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఒక సినిమా షూటింగ్లో భాగంగా శ్రీ లీల ఒక గ్రామానికి వెళ్ళింది.ఈ నేపథ్యంలోనే అక్కడి రోడ్లపై గుడిలో ఆవుల దగ్గర ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఫోటోలకు క్వాలిటీ తక్కువగా ఉండటం పై స్వారీ చెప్పింది.

ఓ క్షణం ఆగి జీవితంలోని చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయండి అనే క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube