అభిమానులకు క్షమాపణలు చెప్పిన శ్రీ లీల.. ఎందుకో తెలుసా?
TeluguStop.com
టాలీవుడ్ హీరోయిన్ శ్రీ లీల గురించి మనందరికీ తెలిసిందే.పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
మొదటి సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.
మరి ముఖ్యంగా ఈమె అందానికి డాన్స్ కి యూత్ లో విపరీతమైన అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు.
రెండవ సినిమాతోనే స్టార్ హీరో అయినా రవితేజ సరసం నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.
"""/" /
ఇక ఇటీవలే విడుదల అయిన ధమాకా సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ ఖాతాలో మరో హిట్ సినిమా పడింది.
దీంతో శ్రీ లీల వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.సినిమాలపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోని ఈ మధ్యకాలంలో క్రేజ్ పెరిగిపోతుండడంతో సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు కూడా సై అంటుంది ఈ బ్యూటీ.
ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ లీల అభిమానులకు క్షమాపణలు చెప్పింది.అసలు ఏం జరిగిందంటే.
తాజాగా శ్రీ లీల సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. """/" /
అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఒక సినిమా షూటింగ్లో భాగంగా శ్రీ లీల ఒక గ్రామానికి వెళ్ళింది.
ఈ నేపథ్యంలోనే అక్కడి రోడ్లపై గుడిలో ఆవుల దగ్గర ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఫోటోలకు క్వాలిటీ తక్కువగా ఉండటం పై స్వారీ చెప్పింది.
ఓ క్షణం ఆగి జీవితంలోని చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయండి అనే క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.
నీ ఫోన్ ఆయుష్షు మామూలుగా లేదు సోదరా.. బాలయ్యతో ఫోటోపై నెటిజన్ల కామెంట్స్ వైరల్!