హీరోయిన్ మీరా చోప్రా విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరిగా లేదు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తనకు మహేష్‌బాబు అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అంటూ చెప్పిన మీరా చోప్రా తనకు ఎన్టీఆర్ గురించి పెద్దగా తెలియదు అంటూ చేసిన వ్యాక్యలకు గాను ఏకంగా ఆమెను చంపేస్తామంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించడం, భౌతిక దాడికి త్వరలోనే సిద్దంగా ఉండూ అంటూ హెచ్చరించడం వంటి పోస్ట్‌లతో విసిగి పోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.ఈ మొత్తం వ్యవహారంలో ఎన్టీఆర్‌కు చెడ్డ పేరు వస్తుంది.ఎన్టీఆర్ అభిమానులు అంటూ పదే పదే మీడియాలో వార్తలు వస్తున్న కారణంగా ఆయనకు తలనొప్పులు తప్పడం లేదంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ కేసు విషయంలో ఎన్టీఆర్‌ను సైతం పోలీసులు అవసరం ఉంటే ప్రశ్నించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ పేరును చెడగొట్టేందుకు కొందరు కావాలని మీరా చోప్రాను బెదిరించేందుకు సిద్దం అయ్యారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఉన్న మంచి పేరును చెడగొట్టి పబ్బం గడుపుకునేందుకు వారు చేసిన ప్రయత్నమే ఇది అంటూ ఆరోపిస్తున్నారు.మీరా చోప్రా గురించి బ్యాడ్ కామెంట్స్ చేసి ఆమెను చంపుతామని బెదిరించింది ఖచ్చితంగా ఎన్టీఆర్ నిజమైన అభిమానులు అయ్యి ఉండరు అనేది కొందరు ఫ్యాన్స్ అభిప్రాయం.