స్పీడు పెంచిన కువైట్... కువైటైజేషన్ లో ఊడిపోయిన ఉద్యోగాలు ఎన్నంటే...!!

ప్రపంచ నలు మూలల నుంచీ ఎంతో మంది ప్రవాసులు కువైట్ దేశానికి వలసలు వెళ్తూ ఉంటారు.అలా వెళ్లి స్థిరపడిన వారిలో భారత్ నుంచే అత్యధిక మంది వలసలు వెళ్ళిన వారిలో ఉంటారు.

 Nris Lost Jobs In Kuwait Due To Kuwaitization, Kuwaitization, Nri,kuwait, Jobs L-TeluguStop.com

అయితే కువైట్ లో మారుతున్న కాలానికి అనుగుణంగా కువైటైజేషన్ తెరమీదకు వచ్చింది.అంటే గతంలో ఎప్పుడు కువైట్ వాసులు ప్రవాసులు చేసే ఉద్యోగాలు చేసేవారు కాదు, కానీ నేడు ఎంతో మంది తాము కూడా ప్రవాసులు చేసే ఉద్యోగాలు చేస్తామని పట్టుబట్టడంతో కువైట్ ప్రభుత్వం కువైటైజేషన్ ను తెరమీదకు తీసుకువచ్చింది.

ఇందులో భాగంగానే

కువైట్ లో 60 ఏళ్ళకు పైబడిన ప్రవాసులు ఎవరు ఉంటారో వారిని దేశం నుంచీ పంపేందుకు వారి వీసా రెన్యువల్ ఫీజును భారీగా పెంచింది.అంటే వారికి ఏడాదికి వచ్చే జీతం కంటే కూడా ఈ రెన్యువల్ ఫీజు అధికంగా ఉంటుందన్నమాట.అయితే కొందరు ఈ ఫీజుల విషయంలో నిరసనలు తెలుపడంతో 4 లక్షల నుంచీ 2.50 లక్షలకు రెన్యువల్ ఫీజు తగ్గించింది.ఇదిలాఉంటే

కువైట్ గడిచిన ఐదేళ్ళలో పలు కీలక విభాగాలలో పనిచేస్తున్న ప్రవాసులను తొలగిస్తూ వచ్చింది.ఇలా దాదాపు 420 మంది ప్రవాసులను ఉద్యోగాల నుంచీ తొలగించింది.పబ్లిక్ అధారిటి ఫర్ హౌసింగ్ వెల్ఫేర్ కువైటైజేషన్ లో భాగంగానే దాదాపు 420 మంది ప్రవాసులను తమ శాఖ నుంచీ తప్పించిందని తెలుస్తోంది.ప్రస్తుతం సదరు శాఖలో 1400 మంది పైగా ఉద్యోగులు ఉన్నారని అయితే ఇందులో 170 మంది ప్రవాసులే ఉన్నారని, ప్రకటించింది.

కువైటైజేషన్ లో భాగంగా వీరిని కూడా త్వరలో విధుల నుంచీ తప్పించే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.అయితే తాజా పరిస్థితులను పరిశీలిస్తే కువైట్ ప్రభుత్వం కువైటైజేషన్ ను అమలు చేయడంలో వేగంగా అడుగులు వేస్తున్నట్టుగానే ఉందని, భవిష్యత్తులో దీని ప్రభావం ప్రవాస భారతీయులమీదే చూపుతుందని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube