సల్మాన్ ఖాన్ ఫస్ట్ మూవీ డిజాస్టర్.. ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తో పాటు భారీస్థాయిలో మార్కెట్ ఉన్న హీరోలలో సల్మాన్ ఖాన్ కూడా ఒకరు.సల్మాన్ ఖాన్ నటిస్తే టాక్ తో సంబంధం లేకుండా సినిమాకు కలెక్షన్లు వస్తాయి.

 Hero Salman Khan First Movie Remuneration Details Here, 11000 Rupees, First Movi-TeluguStop.com

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాకు 100 కోట్ల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్న హీరోలలో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారు.అయితే ఈ స్టార్ హీరో ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ మాత్రం తక్కువ మొత్తం కావడం గమనార్హం.

బీవీ హోతో హౌసీ అనే సినిమాతో సల్మాన్ ఖాన్ నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ నామమాత్రపు పాత్రకు పరిమితమయ్యారు.అయితే ఆ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన మైనే ప్యార్ కియా సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు సల్మాన్ ఖాన్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.ఓవర్ నైట్ లోనే సల్మాన్ ఖాన్ స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.

సల్మాన్ ఖాన్ కు మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా అభిమానించే అభిమానులు లక్షల సంఖ్యలో ఉండటం గమనార్హం.

Telugu Rupees, Anthim Final, Biwi Haito Aisi, Bollywood, Salman Khan-Movie

అయితే సల్మాన్ ఖాన్ తొలి సినిమా రెమ్యునరేషన్ కేవలం 11,000 రూపాయలు కావడం గమనార్హం.బీవీ హోతే హౌసీ తన తొలి మూవీ కావడంతో ఎక్కువ మొత్తం డిమాండ్ చేయలేకపోయానని సల్మాన్ చెప్పుకొచ్చారు.సల్మాన్ ఖాన్ లాక్ డౌన్ కు ముందు దబాంగ్ 3 విడుదల చేయగా లాక్ డౌన్ తర్వాత రాధే సినిమాను విడుదల చేశారు.

Telugu Rupees, Anthim Final, Biwi Haito Aisi, Bollywood, Salman Khan-Movie

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ అంతిమ్ ది ఫైనల్ ట్రూత్ అనే మూవీలో నటిస్తున్నారు.ఒకవైపు నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తూనే సల్మాన్ ఖాన్ పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.లాల్ సింగ్ చద్దా సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube