అమెరికాలో పేరొందిన తెలుగు సంఘాలలో ఒకటైన ఉపాస (UPAS) సంఘం సభ్యులు అందరూ ఒకే వేదికగా కలిసుకున్నారు.ఆటపాటలతో ఆహ్లాదంగా పచ్చని వాతావరణంలో పిల్లలతో గడిపారు.
న్యూ జెర్సీ , మన్రో టవున్ షిప్ , థాంసన్ పార్క్ లో జరిగిన ఈ సంఘ సభ్యుల కుటుంబ వేడుకల్లో పాల్గొనడానికి.అమెరికా రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, కనక్టికట్, న్యూయార్క్ ల నుండి పెద్ద ఎత్తున ఉపాస సభ్యులు చేరుకున్నారు.
ఎవరికీ వారుగా తెలుగు వంటలు వండి తీసుకువచ్చారు.ఉపాస సభ్యులు అందరూ ఆటపాటలతో అందరి కుటుంభ సభ్యులతో చేరి సంతోషంగా గడిపారు.ఉపాస సభ్యులలో కొందరు వాలీ మరి కొందరు షట్లర్ ఆడుతూ సమయం గడిపారు ఈ సందర్భంగా ఉపాస సంస్థ సభ్యులైన డాక్టర్లు శ్రీ సాయి కొల్ల , శ్రీ రామ్ కొల్ల ఉపాస సభ్యులకు బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకొనే ఎలక్ట్రానిక్ పరికరాలను ఉచితంగా పంపిణీ చేశారు .
అయితే ఆటపాటల ద్వారా వచ్చిన నగదు మొత్తాన్ని ఏపీలో కిడ్నీ సమస్యలతో భాదపడుతున్న శ్రీకాకుళం ఉద్దానం ప్రాంత ప్రజలకు అందచేయఅనున్నట్టు తెలిపారు.ఉపాస అనేది కేవలం సేవ కోసం మాత్రమే స్థాపించబడిన సంఘం ఈ సంఘంలో ఎంతో మంది చేరుతూ సంఘం రెట్టిపు అవుతోంది అంటూ సంతోషం వ్యక్తం చేశారు.ఇదే సమయంలో ఉపాస సంస్థ జనసేన పార్టీ కి పూర్తి మద్దతు తెలుపుతోందని ప్రకటన చేశారు.