ఏపీ సీఎం జగన్(CM Jagan) బీసీలకు పెద్దపీట వేస్తున్నారని మాజీ మంత్రి ఆళ్ల నాని ( Ex Minister Alla Nani) అన్నారు.జగన్ ను ఎదుర్కొలేక ప్రతిపక్షాలన్నీ కుమ్మక్కు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
జగన్ ను గద్దె దింపడం కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu)తో జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేతులు కలిపారని ఆరోపించారు.
అయితే ఎంతమంది చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరని పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రజలకు సీఎం జగన్ చేసిన మంచి, అందించిన సంక్షేమ పథకాలే (Welfare Schemes) ఆయనను మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.