‘‘రా రా లింగా.రా రా లింగా.
కథ సెబుతా ఖచ్చితంగా.రా రా లింగా.
రామ లింగా.ఇనుకోరా శుబ్బరంగా పైకి సూత్తే ఎంతో సురుకు.
లోన మాత్రం లేదు సరుకు ఊరు మొత్తం ఇంతేనయ్యో తళుకు బెళుకు అంటూ.’’ ఓ విచిత్రమైన ఊరు గురించి చెబుతున్నారు ‘స్కై లాబ్’ నిర్మాతలు.
ఇంతకీ ఆ ఊరు ఏదో తెలుసా? బండ లింగపల్లి.ఈ గ్రామంలో గౌరి(నిత్యా మీనన్) ఓ ధనివంతురాలి బిడ్డ.
కానీ జర్నలిస్ట్ కావాలనే కోరికతో ప్రతిబింబం పత్రికకు వార్తలు సేకరించి రాస్తుంటుంది.అదే గ్రామం నుంచి డాక్టర్ చదువు చదివిన ఆనంద్(సత్యదేవ్) హాస్పిటల్ పెట్టాలనే ఆలోచనతో ఉంటాడు.
వీరికి సుబేదార్ రామారావు(రాహుల్ రామకృష్ణ) స్నేహం కుదురుతుంది.ఈ ముగ్గురు వారి వారి సమస్యలను పరిష్కరించాలనుకుని ముందుకు సాగుతుంటారు.
ఆ క్రమంలో అంతరిక్ష్యంలో ప్రవేశ పెట్టిన ఉపగ్రహం స్కైలాబ్‌లో సాంకేతిక కారణాలో పెను ప్రమాదం వాటిల్లబోతుందని రేడియోలో వార్త వస్తుంది.అది నేరుగా బండ లింగపల్లిలోనే పడుతుందని అందరూ భావిస్తారు.అప్పుడు అందరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయనేదే ‘స్కై లాబ్’ సినిమా.
1979లో సాగే పీరియాడిక్ మూవీ స్కై లాబ్.సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా నటించారు.డా.రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.డిసెంబర్ 4న సినిమా విడుదలవుతుంది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్కై లాబ్ చిత్రం నుంచి ‘ రా రా లింగా.’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ప్రశాంత్ ఆర్.విహారి సంగీత సారథ్యం వహించిన ఈ పాటను సానపాటి భరద్వాజ్ పాత్రుడు రాశారు.సేన్ రోల్డన్ పాటను పాడారు.ఈ పాటకు చాలా మంచి స్పందన వస్తుంది.
ఈ సందర్భంగా నిర్మాత పృథ్వీ పిన్నమరాజు మాట్లాడుతూ ‘‘మా ఫ్యామిలీ ఇది వరకు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉండింది.నిర్మాతగా నేను తొలి అడుగులు వేశాను.
నిత్యామీనన్ గారికి కథ నచ్చడంతో ఆమె కూడా సహ నిర్మాతగా మారారు.సినిమా మేకింగ్‌లో డైరెక్టర్ విశ్వక్ ఐడియాలజీ, టేకింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అలాగే సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ గారు సహా ఎంటైర్ టీమ్ ఇచ్చిన సపోర్ట్‌తో ఓ మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం.ఇది వరకు రిలీజ్ చేసిన ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు రిలీజ్ చేసిన రా రా లింగా.పాటకు కూడా చాలా మంచి స్పందన వస్తుంది.
డిసెంబర్ 4న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
నటీనటులు:
నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనుష తదితరులు.
సాంకేతిక నిపుణులు:
మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు సహ నిర్మాత: నిత్యామీనన్ సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది ఎడిటర్: రవితేజ గిరిజాల మ్యూజిక్: ప్రశాంత్ ఆర్.విహారి ప్రొడక్షన్ డిజైన్: శివం రావ్ సౌండ్ రికార్డిస్ట్: నాగార్జున తల్లపల్లి సౌండ్ డిజైన్: ధనుష్ నయనార్ కాస్ట్యూమ్స్: పూజిత తడికొండ పి.ఆర్.ఒ: వంశీ కాకా
.