నిక్కీ హేలీ ఈమె పేరు తెలియని వారు ఉండరు.భారత్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమె తల్లి తండ్రులు ఎప్పుడో అమెరికా వచ్చి స్థిరపడ్డారు.నిక్కీ అమెరికా సైనిక ఉద్యోగి అయిన మైకేల్ హేలీతో వివాహం జరిగింది ఆమె అమెరికాలో అత్యంత ప్రభావ వంతురాలిగా వార్తల్లో నిలిచారు… 2010లో దక్షిణ కరోలినా గవర్నర్‌గా ఎన్నికయ్యారు.2014లోనూ గవర్నర్ ఎన్నికల్లో ఆమె భారీ మెజార్టీతో గెలుపొందారు.
అయితే ప్రస్తుతం నిక్కీ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నిక్కీ హేలీ ఇవాళ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం అందుతోంది…అంతేకాదు ట్రంప్ సైతం ఆమె రాజీనామాని ఆమోదించాడని తెలుస్తోంది.ఈ విషయంపై వైట్‌హౌస్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఓవల్ ఆఫీస్‌లో ఉదయం 10:30 గంటలకు నా ఫ్రెండ్ నిక్కీహేలీతో కలిసి పెద్ద ప్రకటన చేయబోతున్నానని ట్రంప్ తన అధికారిక ట్విటర్‌లో పేర్కొన్నారు.
2017 జనవరిలో యూఎన్‌లో యూఎస్ అంబాసిడర్‌గా ఆమె నియమితులయ్యారు.అనేక అంశాలపై స్పష్టంగా మాట్లాడే వైఖరి నిక్కీహేలీది.ఆ చాతుర్యమే ఆమెను యూఎన్‌లో అమెరికా రాయబారిగా నియమితులయ్యే అవకాశాన్ని అందించింది.
అయితే అనేక హక్కుల పోరాటాలో ప్రజల తరుపున పోరాడిన నిక్కీ.రష్యాపై శాశ్వత ఆంక్షలు విధించాల్సిందని ట్రంప్ సన్నిహితుల నుంచి ఒత్తిడి రావడంతో ఏప్రిల్‌లో ఆమె శ్వేతసౌధ వర్గాలతో విభేదించారు.
అయితే ట్రంప్ విధానాలే ఆమెని రాజీనామా వైపుకు నడిపించాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.