నాట్స్ ఆధ్వర్యంలో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్..

అమెరికాలో ఉండే కొన్ని లక్షల మంది తెలుగువారు వివిధ ప్రాంతాలలో ఉంటున్నారు.అయితే ఆయాప్రాంతాలకి దగ్గరలో కొన్ని కొన్ని తెలుగుసంఘాలని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు కలుసుకుంటూ ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందుకుంటూ ఉంటారు.

 Nats Convention Volleyball Tournament-TeluguStop.com

అంతేకాదు సెలవురోజుల్లో లేదా తెలుగు పండుగల సమయుంలో కలుసుకుని భారత సాంప్రదాయ ఆటలు కానీ లేదా వివిధ కల్చరర్ ఆటలు ఆడుతూ వచ్చిన సొమ్ముతో సేవా కార్యకమాలు నిర్వహిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఫిలిడెల్ఫియాలోని కింగ్ ఆఫ్ పర్షియాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సంస్థ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఎంతో ఘనంగా నిర్వహించింది.ఈ టోర్నమెంట్‌లో తెలుగు ఆటగాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.అమెరికాలో తెలుగుజాతిని ఒక్కటిగా చేస్తున్న నాట్స్ తెలుగువారిలో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు పలు టోర్నమెంటులు నిర్వహిస్తుంది.

ఈ క్రమంలోనే ఫిలడెల్ఫియాలోని కింగ్ ఆఫ్ ఫర్షియాలో నాట్స్ వాలీబాల్ టోర్నరమెంట్ నిర్వహించింది.

ఇదిలాఉంటే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన నాట్స్ వైస్ చైర్మన్ శ్రీథర్ అప్పసాని ఈ టోర్నమెంటుకు విశేష స్పందన రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఈ పోటీలలో 20 టీంలు వాలీబాల్ టోర్నమెంట్‌లో పాల్గొని ఉత్సాహాంగా ఆడాయి.స్థానిక తెలుగుసంఘం టీఏజీడీవీ కూడా టోర్నమెంటుకు తన వంతు సహకారం అందించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube