తెలంగాణ లో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ మేరకు ఇప్పటివరకు జరిగిన అనేక సర్వేల డేటా ఆధారం చేసుకుని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపినీయన్ పోల్స్‌ను ప్రకటించింది.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి దాదాపు 85 సీట్లు వస్తాయని పలు సర్వేలు వెల్లడించాయి.
టీమ్ ప్లాష్, వీడీఏ అసోసియేట్స్, సీ ఓవటరు, ఐటీ టెక్ గ్రూప్, టైమ్స్ నౌ సర్వేల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని తేలింది.ఈ సర్వేలను క్రోఢీకరించి మంగళవారం ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది.తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా, ద టీమ్ ఫ్లాష్, వీడీయే అసోసియేట్స్ సంస్థల సర్వేల తరువాత, టీఆర్ఎస్ కు 85, కాంగ్రెస్ కు 18, ఎంఐఎం కు 7, బీజేపీకి 5, ఇతరులు 4 స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది.
తెలంగాణలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 63, కాంగ్రెస్ 21, మజ్లిస్ 7, తెలుగుదేశం 15, బీజేపీ 5 స్థానాల్లో గెలిచింది.అయితే ఈసారి మజ్లిస్, బీజేపీలు గతంలో గెలిచిన స్థానాలే గెలవనున్నారు.కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే రెండు మూడు సీట్లు తక్కువగా వచ్చే అవకాశముంది.2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 15 స్థానాల్లో గెలిచింది.ఈసారి ఆ పార్టీ ఒకటి రెండు స్థానాల్లో లేదంటే ఆ సీట్లు కూడా గెలిచే అవకాశాలు లేదని సర్వేలో తేలిందట.