నిఖిల్ 'స్పై' లేటెస్ట్ అప్డేట్.. త్వరలోనే టీజర్ రాబోతుందంటున్న మేకర్స్!

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిఖిల్ సిద్దార్థ్ తన టాలెంట్ తో వరస హిట్లు కొట్టి మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలదొక్కుకున్నాడు.అతడి కెరీర్ లో కార్తికేయ సినిమా ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

 Nikhil Spy Intro Glimpse, 18 Pages Movie, Nikhil Siddharth, Director Garry Bh, I-TeluguStop.com

అయితే మధ్యలో వరుస ప్లాపులు రావడంతో ఈయన రేస్ లో వెనుక బడ్డాడు.ఇటీవలే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యిన నిఖిల్ ఒక్క సూపర్ హిట్ తో తన కెరీర్ ను కూడా గాడిలో పెట్టుకోవాలని చూస్తున్నాడు.

ప్రెసెంట్ నిఖిల్ నటిస్తున్న సినిమాల్లో ’18 పేజెస్’ ఒకటి.ఈ సినిమాను కుమారి 21F సినిమా ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ సినిమా కథను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ రాయడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.అలాగే నిఖిల్ కార్తికేయ 2 సినిమా కూడా చేస్తున్నాడు.

ఇక ఇటీవలే నిఖిల్ మరొక కొత్త సినిమాపై సైన్ చేసాడు.ఈ సినిమా నిఖిల్ కెరీర్ లో 19వ సినిమా.

ఈ మూవీకి ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించ నున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను ఈ రోజు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసారు.

ఈ సినిమాకు స్పై అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు.ఇది నిఖిల్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా.ఈ సినిమాను దసరా కానుకగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తుండగా.

ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా ఐశ్వర్య మీనన్ నటిస్తుంది.

Telugu Pages, Garry Bh, Iswarya Menon, Karthikeya, Nikhilspy, Nikhil Spy-Movie

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించిన అప్డేట్ ఒకటి మేకర్స్ అందించారు.ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ద్వారా తెలిపారు.

రేపు జూన్ 6 సోమవారం ఉదయం 11 గంటల 11 నిముషాలకు ఒక ఇంట్రో గ్లిమ్స్ లా రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేసారు.మరి ఈ అప్డేట్ ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube