తెలంగాణలో కరోనా మహమ్మారి విపరీతంగా చెలరేగిపోతుందని తెలిసిందే.గత సంవత్సరం మిస్సైన వారి జాబితాను బట్టిపట్టిన కోవిడ్ వారిపై ప్రస్తుత పరిస్దితుల్లో విరుచుకుబడుతుంది.
ఈ క్రమంలో సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు కరోనా బారిన పడుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే.
స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన వైద్యుల సూచన మేరకు ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు.కాగా ఈ నేపధ్యంలో ఒకవేళ కేసీఆర్ ఆస్పత్రిలో చేరాల్సి వస్తే సికింద్రాబాద్ గాంధీకి వెళ్లాలని నెటిజన్లు కోరుతున్నారట.
కాగా గాంధీలో అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయని, కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని కేసీఆర్ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తున్న నెటిజన్లు ఈ విధంగా సలహాలు ఇస్తున్నారని సమాచారం.ఇకపోతే కేసీఆర్ చెప్పిన దానికి వ్యతిరేకంగా గాంధీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రాణాలు వదులుతున్నారని, అందు వల్ల ఈ టైంలో కేసీఆర్ గాంధీలో చేరితే, ప్రజలకు ధైర్యం వస్తుందని నెటిజన్లు సూచిస్తున్నారట అంతేకదండీ నరం లేని నాలుక ఎన్నైనా చెబుతుంది.
అనుభవించే వారికే తెలుస్తుంది ఆ బాధ.