మహేష్ నటించి ఉంటే మేజర్ ఇండస్ట్రీ హిట్ అయ్యేదా.. ఏం జరిగిందంటే?

అడివి శేష్, సయీ మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన మేజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కగా ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది.

 Netizens Comments About Major Script Is Suitable For Mahesh Babu Goes Viral , M-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాగా ఫుల్ రన్ లో ఈ సినిమా భారీగా లాభాలను అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.మేజర్ కు నిర్మాతగా వ్యవహరించిన వారిలో మహేష్ బాబు ఒకరనే సంగతి తెలిసిందే.

అయితే మహేష్ బాబు మేజర్ సినిమాలో నటించి ఉంటే మాత్రం మేజర్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.మహేష్ బాబుకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.

మేజర్ సినిమాకు శశికుమార్ తిక్కా దర్శకత్వం వహించగా ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి కూడా పాజిటివ్ గా రివ్యూలు వచ్చాయి.ఈ సినిమా థియేట్రికల్ కలెక్షన్లు ఏకంగా 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లుగా ఉన్నాయి.

మేజర్ సినిమా గొప్ప సైనికుడి కథ కావడంతో మహేష్ ఈ సినిమాలో నటించి ఉంటే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యేదని మహేష్ బాబు అభిమానులు భావిస్తున్నారు.ఈ సినిమాలో మహేష్ బాబు నటించి ఉంటే పాన్ ఇండియా హీరోగా మహేష్ బాబుకు గుర్తింపు దక్కి ఉండేది.

మహేష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం వల్లే ఈ సినిమా ఇంత క్వాలిటీతో తెరకెక్కిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Adavi Sesh, Netizens, Sai Manjrekar-Movie

మరోవైపు త్రివిక్రమ్ ఇప్పటికే మహేష్ ను కలిసి తర్వాత సినిమా కథను వినిపించారు.త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.మేజర్ సినిమా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

అడివి శేష్ తర్వాత సినిమాలతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube