అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ కార్డ్ విషయంలో కీలక ప్రకటన చేయనున్న నేపధ్యంలోనే తాజాగా బయటపడిన ఈ గ్రీన్ కార్డ్ స్కామ్ అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.ఈ మేరకు పోలీసులు రంగంలోకి తీగ లాగితే డొంకంతా కదిలింది.
వివరాలలోకి వెళ్తే.అమెరికాలోని టెక్సాస్ లో నకిలీ పెళ్ళిళ్ళకి సంభందించిన ఓ భారీ స్కామ్ బయటపడింది.
గ్రీన్ కార్డ్ కోసం ఏకంగా 100 మంది వరకు మ్యారేజ్ ఫ్రాడ్‌లో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది.
గ్రీన్ కార్డ్ కోసం ఏర్పాటు చేసిన ఈ స్కామ్‌లో హూస్టన్ వాసి అయిన ఆష్లే యెన్ న్యూయేన్ అనే మహిళ కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది.
ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ విషయాన్నీ గుర్తించారు.ఈ తతంగం మొత్తం ఆమె కనుసన్నల్లోనే జరిగిందని, టెక్సాస్, వియత్నంలో ఈ స్కామ్ భారీ స్థాయిలో జరిగినట్టుగా తెలిపారు అధికారులు.
గడిచిన ఆరేళ్ళ కాలంలో నిందితులు ఏకంగా 150 ఫేక్ పెళ్లి సర్టిఫికెట్స్, ఫొటో ఆల్బమ్స్‌ను క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇతర దేశాల వ్యక్తులకి గ్రీన్ కార్డ్ ఇప్పించేందుకు ఆమె గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయిన స్థానికులతో డమ్మీ పెళ్ళిళ్ళు చేయించి , ఆ పెళ్ళిళ్ళ ఆల్బమ్స్ రెడీ చేసుకునే వారట.వాటి ద్వారా గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు చేసేవారని తేటతెల్లం అయ్యింది.అయితే ఇలా చేయడం కోసం విదేశీయుల నుంచీ ఆమె 50వేల నుంచి 70వేల డాలర్లు వసూలు చేసినట్టుగా అధికారులు పేర్కొన్నారు.
ఈ కేసు విషయంలో ఆమెకి దాదాపు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.