అంటే సుందరానికి.. తెలుగు డబ్బింగ్ కోసం నజ్రియా కష్టాలు..!

నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో వస్తున్న సినిమా అంటే సుందరానికీ.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన మళయాళ భామ నజ్రియా హీరోయిన్ గా నటించింది.

 Nazriya Telugu Dubbing Problems For Nani Ante Sundaraniki ,nazriya,ante Sundaran-TeluguStop.com

తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా జూన్ 10న రిలీజ్ అవుతుంది.ఈ సినిమా కోసం నజ్రియా తన డబ్బింగ్ తానే చెప్పుకుంటుంది.

తెలుగులో డబ్బింగ్ చెప్పేందుకు నజ్రియా తెగ కష్టపడుతుంది.సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నజ్రియా తెలుగు డబ్బింగ్ కోసం పడుతున్న ఇబ్బందులను ఓ వీడియోగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేయకపోయినా రాజా రాణి సినిమాతో నజ్రియాకు తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది.నాని సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.

అంటే సుందరానికీ సినిమాలో నజ్రియా లీల పాత్రలో నటిస్తుంది.శ్యామ్ సింగ రాయ్ సినిమాతో హిట్ అందుకున్న నాని అంటే సుందరానికీ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.

ఈ సినిమా తర్వాత నాని దసరా సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తున్న దసరా సినిమాలో నాని ఊర మాస్ లుక్ తో కనిపించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube