ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) ,వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya )హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తాజా చిత్రం బేబీ ( Baby ) ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు.
ఇప్పటికే ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు బేబీ సినిమా పై ప్రశంసలు కురిపించారు.ఈ క్రమంలోనే లేడీ సూపర్ స్టార్ నయనతార ( Nayanatara ) భర్త డైరెక్టర్ విగ్నేష్ శివన్( Vignesh Shivan ) కూడా బేబీ సినిమాపై ప్రశంసల కురిపించారు.
తాజాగా బేబీ సినిమా చూసినటువంటి డైరెక్టర్ విగ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.ఈ కమింగ్ ఏజ్ మూవీకి దెబ్బకి క్రేజీ రికార్డులు బద్దలవుతున్నాయి.ఇది బోల్డ్ టీమ్ చేసిన ప్రయత్నం.బోల్డ్ గా రాయడమే కాదు, అంతే క్రూరంగా తెరపైకి ఎక్కించారు.ఇది గొప్ప విజయం సాధించినందుకు అభినందనలు అని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలిపారు.ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇలా బేబీ సినిమా గురించి ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందించి పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా ఎంతో మంచి సక్సెస్ సాధించింది ఒక చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా ఏకంగా 70 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది అంటే మామూలు విషయం కాదని చెప్పాలి ఇక ఈ సినిమా ద్వారా ఆనంద్ దేవరకొండ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అలాగే నటి వైష్ణవి చైతన్య కూడా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకొని వరుస సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటున్నారని తెలుస్తుంది.