డార్క్ అండర్ ఆర్మ్స్.చాలా మందిని కలవర పెట్టే సమస్యల్లో ఒకటి.
ముఖ్యంగా మగువలు ఈ సమస్య వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.అండర్ ఆర్మ్స్ నల్లగా ఉండటం వల్ల స్లీవ్ లెస్ దుస్తులను వేసుకునేందుకు సంకోచిస్తుంటారు.
తమ డార్క్ అండర్ ఆర్మ్స్ ( Dark underarms )చూసి ఎక్కడ బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తారో అని భయపడుతుంటారు.టైట్ దుస్తులను వేసుకోవడం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, సరిగ్గా గాలి ఆడక పోవడం, మాయిశ్చరైజర్ ను అప్లై చేయకపోవడం తదితర కారణాల వల్ల అండర్ ఆర్మ్స్ నల్లగా మారుతుంటాయి.
ఈ నలుపును ఎలా వదిలించుకోవాలో తెలియక తోచిన ప్రయత్నాలు చేస్తుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ న్యాచురల్ రెమెడీని పాటిస్తే కేవలం ఒక్క వాష్ లోనే అండర్ ఆర్మ్స్ లోని నలుపు మొత్తం మాయం అవుతుంది.
మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు షుగర్( Sugar ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి( rice flour ), వన్ టేబుల్ స్పూన్ గోధుమపిండి( wheat flour ), రెండు టేబుల్ స్పూన్లు వైట్ టూత్ పేస్ట్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) మరియు తేనె వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని.
అర నిమ్మ చెక్కతో స్క్రబ్బింగ్ చేసుకోవాలి.మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుని ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఈ విధంగా చేస్తే చర్మం పై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.అలాగే అండర్ ఆర్మ్స్ లో నలుపు మొత్తం వదిలిపోతుంది.ఇంకా ఏమైనా నలుపు ఉంటే కనుక మూడు నాలుగు సార్లు ఈ రెమెడీని ప్రయత్నించండి.దీంతో కొద్ది రోజుల్లోనే మీ అండర్ ఆర్మ్స్ తెల్లగా మృదువుగా మారుతాయి.
దాంతో మీకు ఇష్టమైన దుస్తులు వేసుకోవచ్చు.కాబట్టి అండర్ ఆర్మ్స్ తో బాధపడే వారు తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని పాటించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.