మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత ఈయన విరూపాక్ష సినిమా( Virupaksha Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా ఏకంగా 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి సాయి ధరమ్ తేజ్ కు మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి.
ఈ విధంగా విరూపాక్ష సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈయన తన తదుపరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) సాయి ధరంతేజ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం బ్రో( Bro ).ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి ధరమ్ తేజ్ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ… ఒకానొక సమయంలో తన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి ఆ సమయంలో తన పట్ల ఎంతోమంది ఎన్నో విమర్శలు చేశారని సాయిధరమ్ తేజ్ వెల్లడించారు.

ఈ విధంగా వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో చాలామంది ఇక ఇండస్ట్రీలో సాయిధరమ్ తేజ్ పని అయిపోయిందని ఈయన కెరియర్ ఇంతటితో సమాప్తం అని తాను సినిమా ఇండస్ట్రీలో కాకుండా మరి ఏదైనా పని చూసుకుంటే బెటర్ అంటూ చాలామంది తన కెరియర్ పట్ల కామెంట్స్ చేశారు.అయితే ఒకానొక సమయంలో నాకి కూడా ఇది నిజమేనా నేను ఇండస్ట్రీలో కొనసాగలేనా నేను హీరోగా సక్సెస్ కాలేనా అన్న సందేహాలు కూడా వచ్చాయని సాయి ధరంతేజ్ తెలిపారు.అయితే విరూపాక్ష సినిమా తనకు మంచి బూస్ట్ ఇచ్చిందని సినిమాలపై నాకు మరింత నమ్మకాన్ని పెంచిందని ఈ సందర్భంగా సాయి తేజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







