ఆ హీరోయిన్ సినిమాల్లో నటిస్తుందంతే... ప్రమోషన్స్ కి రాదు...

ఎప్పుడు విభిన్న కథనాలను ఎంచుకుంటూ ఇటు తెలుగు ప్రేక్షకులను అటు తమిళ ప్రేక్షకులను ఎంతగానో అలరించే నయనతార గురించి పెద్దగా పరిచయం చేసుకోవలసిన అవసరం లేదు.ఎందుకంటే ఇప్పటికే ఆమె తమిళ్ లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Nayanthara Darbar Rajani Kanth Murugudas-TeluguStop.com

అంతేగాక లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించడం అంటే ఆమెకు పెట్టింది పేరు.అయితే నటన పరంగా ఎంత మంచి పేరు ఉన్నప్పటికీ మీడియా పై మాత్రం ఆమెకు సదుద్దేశం లేదు.

 ఎందుకంటే గతంలో నయనతార చేసిన కొన్ని మర్శలను పలు మీడియా చానళ్లు వివాదాస్పదంగా చిత్రీకరించారని నయనతార అభిప్రాయపడుతోంది.దాంతో నయనతార తాం నటించిన సినిమా ఈవెంట్లకి హాజరు కాకూడదని నిర్ణయించుకుంది ఈ అమ్మడు.

ఇందులో భాగంగానే అప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క ఆడియో ఫంక్షన్ లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ నయనతార హాజరు కాదు.

అయితే తాజాగా నయనతార నటించిన చిత్రం దర్బార్.

ఈచిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదలైన బ్రహ్మాండమైన వసూళ్లు సాధిస్తోంది.

దర్బార్ చిత్రం విడుదలకు ముందు ఆడియో ఫంక్షన్ కి గాని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గాని నయనతార హాజరు కాలేదు.అంతేకాక సినిమాల్లో నటిస్తాను కానీ ఎలాంటి ప్రమోషన్ ఫంక్షన్ లకి హాజరుకావాలని ముందే షరతు పెట్టినట్లు తెలుస్తోంది.

Telugu Nayanthara, Nayanthara Wont-Movie

అయితే ఈ చిత్ర దర్శకుడు అయినటువంటి ఏఆర్ మురుగదాస్ పై కూడా నయనతార ఒకప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసింది.తను గతంలో సూర్య సరసన నటించిన టువంటి గజినీ చిత్రంలో తన పాత్రని డీ గ్లామరస్ గా  చూపించారని, అంతేగాక తనకు దర్శకుడు చెప్పింది ఒకటని కానీ ఆ చిత్రంలో తనను చూపించింది మరోలా అని మురుగదాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన అటువంటి మురుగదాస్ కూడా తన చిత్రంలో పాత్రలకు అనుగుణంగా మాత్రమే చూపించాలని ఎవరిని ఉద్దేశించి కానీ ఒకరు ఎక్కువ తక్కువ అన్న భేదంతో కానీ చూడలేదని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube