వామ్మో.. శ్యామ్ సింగరాయ్ రెండు రోజుల కలెక్షన్లు అన్ని కోట్లా?

న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.పునర్జన్మ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా అబవ్ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.

 Nani Shyam Singaroy Movie Two Days Collections Details, Natural Star Nani, Nani-TeluguStop.com

ఓవర్సీస్ లో ఈ సినిమాకు 4 లక్షల డాలర్ల కలెక్షన్లు వచ్చాయి.ఫుల్ రన్ లో ఈ సినిమా మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధిస్తుందేమో చూడాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే వరకు శ్యామ్ సింగరాయ్ కు పోటీనిచ్చే సినిమా లేదనే చెప్పాలి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రెండు రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే నైజాంలో ఈ సినిమా ఏకంగా 4 కోట్ల 33 లక్షల రూపాయలు సాధించింది.

సీడెడ్ లో ఈ సినిమా కోటీ 27 లక్షల రూపాయలు, ఉత్తరాంధ్రలో కోటీ 3 లక్షల రూపాయలు, ఉభయ గోదావరి జిల్లాల్లో 74 లక్షల రూపాయలు, కృష్ణా గుంటూరు జిల్లాల్లో 91 లక్షల రూపాయలు, నెల్లూరులో 27 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

ఓవర్సీస్, ఇతర ప్రాంతాలలో కలిపి ఈ సినిమాకు 4.25 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 12.81 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

Telugu Krithi Shetty, Nanishyam, Natural Nani, Sai Pallavi, Shyam Singaroy, Days

ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయల వసూళ్లను సాధిస్తే శ్యామ్ సింగరాయ్ హిట్ అనిపించుకుంటుంది.నానికి జోడీగా సాయిపల్లవి, కృతిశెట్టి ఈ సినిమాలో నటించారు.రెండు పాత్రలలో నాని ఈ సినిమాలో అదరగొట్టారు.

Telugu Krithi Shetty, Nanishyam, Natural Nani, Sai Pallavi, Shyam Singaroy, Days

సినిమాలో కృతిశెట్టి పాత్ర పరిమితం అయినా ఆ పాత్రతో కృతిశెట్టి ఆకట్టుకున్నారు.ఈరోజు కూడా శ్యామ్ సింగరాయ్ కు భారీగానే కలెక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.రాహుల్ సాంకృత్యాన్ రెండో సినిమాతో కూడా సక్సెస్ సాధించారు.ఇండస్ట్రీలో ఉన్న ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ను రాహుల్ సాంకృత్యాన్ బ్రేక్ చేశారు.నిర్మాత వెంకట్ బోయినపల్లి శ్యామ్ సింగరాయ్ ను పలు ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube